తెలంగాణలో పంజా విసురుతున్న కరోనా.. హైదరాబాద్‌ పరిస్థితి ఏమిటి..?

By సుభాష్  Published on  13 Jun 2020 7:27 AM GMT
తెలంగాణలో పంజా విసురుతున్న కరోనా.. హైదరాబాద్‌ పరిస్థితి ఏమిటి..?

తెలంగాణలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక శుక్రవారం కూడా భారీగానే కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 164 పాజిటివ్‌ కేసుల నమోదు కాగా, మరో 9 మంది మృతి చెందారు. తాజాగా తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,484కు చేరగా, మృతుల సంఖ్య 174కు చేరింది. అయితే శుక్రవారం నమోదైన 164 కేసుల్లో 133 కేసులు ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదు కావడం గమనార్హం. ఈ నెలలో 3వ తేదీ తర్వాత ప్రతి రోజు వందకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండటంతో ప్రజల్లో మరింత ఆందోళన నెలకొంది. ఇక హైదరాబాద్‌ నగర వాసులకు మాత్రం దడ పుట్టించేలా ఉంది. నగరంలో రోజురోజుకు పాజిటివ్‌ కేసులు అమాంతంగా పెరిగిపోతున్నాయి. దీంతో భాగ్యనగరం వాసులకు కంటినిండ కునుకు లేకుండా చేస్తోంది. ఇక పోలీసు, వైద్య, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీ, ఆర్డీసీ, మీడియా, పలు కంపెనీలు, సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలు అన్ని రంగాల్లో చాపకింద నీరులా చేరిపోతోంది. ఇక మరణాల సంఖ్య కూడా బాగానే పెరిగిపోతోంది.

హైదరాబాద్‌ పరిస్థితి ఏమిటీ..?

ఇక హైదరాబాద్‌ పరిస్థితిని చూస్తుంటే దారుణంగా మారిపోతోంది. ఎప్పడు ఎక్కడ ఎన్ని కేసులు నమోదు అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. గత వారం రోజులుగా ప్రతిరోజూ సగటున 100 పాజిటివ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కాగా, లక్‌డౌన్‌ సడలింపులు, జనాలు ఇష్టం వచ్చినట్లు రోడ్లపైకి రావడం, మాస్కులు ధరించకపోవడం, అధికారులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లనే కేసుల సంఖ్య పెరుగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలోని కొత్త ప్రాంతాల్లోకూడా కేసులు నమోదు కావడంపై నగరవాసుల్లో భయాందోళన నెలకొంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరిని వదలడం లేదు ఈ కరోనా మహమ్మారి. ఇలాంటి పరిస్థితుళ్లీ లాక్‌డౌన్‌ అమలు చేయాలని పలువురు కోరుతున్నారు. ముందున్న లాక్‌డౌన్‌ కంటే ఈసారి కఠినంగా విధించాలని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. మళ్లీ లాక్‌ డౌన్‌ విధిస్తేనే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉదని, లేకపోతే మరింత ప్రమాదం పొంచివుండే అవకాశాలున్నాయని చెబుతున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లల్లో కూడా మొదట్లో కరోనా కేసులు నమోదైనా .. ఈ మధ్యన తగ్గుముఖం పట్టి, జీహెచ్‌ఎంసీ పరిధిలో విజృంభించింది. ఇక లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇవ్వడంతో జీహెచ్‌ఎంసీతోపాటు ఇతర జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించడం మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలో చాలా ప్రాంతాల్లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.

ఇక కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో భారత్‌ నాలుగో స్థానికి చేరింది. కేంద్ర, ప్రభుత్వాలు కరోనా కట్టడికి ఇప్పటి వరకూ ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు మరోసారి లాక్‌ డౌన్ ను విధించి కఠినంగా అమలు చేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. 16, 17వ తేదీల్లో ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద కరోనా కట్టడికి మరోసారి లాక్‌డౌన్‌ విధించి కఠినంగా విధించే అవకాశాలున్నట్లు సమాచారం.

Next Story