సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ..రెండున్నర గంటల పాటు చర్చలు

సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సమావేశం అయ్యారు.

By -  Knakam Karthik
Published on : 4 Feb 2026 3:02 PM IST

Andrapradesh, Amaravati, Cm Chandrababu, Deputy Cm Pawankalyan, Ap Government, Tdp, Janasena, Ysrcp

సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ..రెండున్నర గంటల పాటు చర్చలు

అమరావతి: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సమావేశం అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో బుధవారం పవన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాగా సీఎం, డిప్యూటీ సీఎంల సమావేశం పొలిటికల్‌గా ఇంట్రెస్టింగ్‌గా మారింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ దాదాపు రెండున్నర గంటలపాటు సమావేశమై వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం.

రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. కుల రాజకీయాలను రెచ్చకొడుతూ వైఎస్సార్సీపీ చేసే కుట్రలను కలసికట్టుగా ఎదుర్కొనే వ్యూహంపై ఇద్దరు అధినేతల భేటీలో చర్చించారు. పార్టీ ట్రాప్​లో పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని నేతలిద్దరూ నిర్ణయానికి వచ్చారు. దీని కోసం అనుసరించాల్సినా వ్యూహంపై చర్చించారు.

Next Story