ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు.. ఏపీ సర్కార్‌ శుభవార్త..!

AP Government good news for students. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర సర్కార్‌ శుభవార్త చెప్పింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే

By అంజి  Published on  5 Jan 2022 7:23 AM GMT
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు.. ఏపీ సర్కార్‌ శుభవార్త..!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర సర్కార్‌ శుభవార్త చెప్పింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే జగనన్న విద్యా దీవెన కిట్లను అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఒకటో తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కిట్లను పంచనున్నారు. ఈ మేరకు సమ్మర్‌ హాలీడేస్‌లో విద్యా దీవెన కిట్లను పాఠశాలలకు చేర్చాలని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియకు సంబంధించిన టెండర్ల ఖరారును త్వరగా పూర్తి చేయాలని, సంబంధిత ఏజెన్సీలతో అనుకున్న సమయంలో అగ్రిమెంట్స్ పూర్తి చేసుకుని వర్క్‌ ఆర్డర్లను జారీ చేయాలని ఆదిమూలపు సురేష్‌ సూచించారు.

జగనన్న విద్యా దీవెన, అమ్మ ఒడి పథకాలకు అర్హులైన లిస్ట్‌ను రెడీ చేయాలని సూచించారు. ఇక విద్యార్థులకు అందించే జగనన్న విద్యా దీవెన కిట్లలో నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, బెల్ట్‌, సాక్సులు, షూస్‌, మూడు జతల యూనిఫామ్‌, బ్యాగ్‌ ఉంటాయి. అలాగే పేద విద్యార్థులు పై చదువులు చదువుకునేందుకు అమలు చేస్తున్న జగనన్న విద్యా దీవెన పథకం కింద మెడిసన్‌, ఇంజనీరింగ్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌, ఐటీఐ కోర్సులు చదివే పేద విద్యార్థులకు పూర్తి ఫీజులను ఆయా కాలేజీలకు ప్రభుత్వమె చెల్లిస్తుంది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్‌ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది.

Next Story