తెలంగాణలో కరోనా విజృంభణ.. ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Sep 2020 4:14 AM GMTతెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,137 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 08 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1,71,306 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కరోనా బారిన పడి 1033 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనా నుంచి 2,192 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు మొత్తం 1,39,700 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.60 శాతం ఉండగా, అదే దేశంలో 1.60 శాతం ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం యాక్టివ్ కేసులు 30,573ఉండగా, హోమ్ క్వారంటైన్‌లో 24,019 మంది ఉన్నారు.
ఏ జిల్లాలో ఎన్ని కేసులు అంటే..
ఆదిలాబాద్ – 20
భద్రాద్రి కొత్తగూడెం- 51
జీహెచ్‌ఎంసీ -322
జగిత్యాల-42
జనగాం- 34
జయశంకర్ భూపాలపల్లి – 21
జోగులాంబ గద్వాల – 27
కామారెడ్డి – 60
కరీంనగర్ -132
ఖమ్మం -90
ఆసిఫాబాద్ – 16
మహబూబ్ నగర్ -28
మహబూబాబాద్ -72
మంచిర్యాల- 38
మెదక్ – 28
మేడ్చల్ మల్కాజ్‌గిరి – 146
ములుగు –15
నాగర్‌కర్నూల్ – 37
నల్లగొండ – 124
నారాయణపేట -9
నిర్మల్ -24
నిజామాబాద్ – 72
పెద్దపల్లి –48
రాజన్న సిరిసిల్ల -57
రంగారెడ్డి -182
సంగారెడ్డి -65
సిద్దిపేట – 109
సూర్యాపేట- 61
వికారాబాద్-29
వనపర్తి –29
వరంగల్ రూరల్ –24
వరంగల్ అర్భన్ -90
యాదాద్రి భువనగిరి – 35 కేసులు నమోదు అయ్యాయి.