భారత్‌లో కరోనా విజృంభణ.. కొత్తగా ఎన్ని కేసులంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Sep 2020 4:57 AM GMT
భారత్‌లో కరోనా విజృంభణ.. కొత్తగా ఎన్ని కేసులంటే..?

భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా నిత్యం 90వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 93,337 కేసులు నమోదు కాగా.. 1,247 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 53,08,015కి చేరింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 85,619 మంది ప్రాణాలు కోల్పోయారు.

నిన్న ఒక్క రోజే 95వేల మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. మొత్తంగా 42,08,432 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 10,13,964 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 79.28శాతం ఉండగా.. మరణాల రేటు 1.61శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజులోనే 8,81,911 కరోనా శాంపిళ్లన్లు పరీక్షించగా.. మొత్తంగా 6,24,54,254 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. 69లక్షలకు పైగా పాటిజివ్‌ కేసులతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంది. భారత్‌లో కరోనా వ్యాప్తి ఇదే విధంగా కొనసాగితే.. మరి కొద్ది రోజుల్లోనే భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంటుంది.

Next Story
Share it