తెలంగాణలో కొత్తగా 1296 కరోనా పాజిటివ్ కేసులు
By Medi Samrat Published on 19 July 2020 4:15 PM GMTతెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 12,519 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 1,296 కేసులు పాజిట్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాతో 24 గంటల్లో ఆరుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 45,076 కేసులు నమోదు కాగా, 415 మంది మృతి చెందారు.
ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీలో 557 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 111 కేసులు, మేడ్చల్ జిల్లాలో 87 కేసులు, సంగారెడ్డి జిల్లాలో 28 కేసులు, కామారెడ్డి జిల్లాలో 67 కేసులు, వరంగల్ అర్బన్ జిల్లాలో 117 కేసులు, వరంగల్ రూరల్‌లో 41 కేసులు, కరీంనగర్ జిల్లాలో 27 కేసులు, జగిత్యాల జిల్లాలో 11 కేసులు, యాదాద్రి భువనగిరి 15 కేసులు, మహబూబబాద్ జిల్లాలో 21 కేసులు, పెద్దపల్లి జిల్లాలో 29 కేసులు, మెదక్ జిల్లాలో 29 కేసులు, నల్గొండ జిల్లాలో 26 కేసులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 19 కేసులు, అదిలాబాద్ జిల్లాలో 15 కేసులు, నాగర్ కర్నూల్ జిల్లాలో 13 కేసులు, నిజామాబాద్ జిల్లాలో 24 కేసులు, సూర్యాపేట జిల్లాలో 16 కేసులు, సిద్దిపేట జిల్లాలో 10 కేసులు చొప్పున నమోదయ్యాయి. గత 40 రోజులుగా తెలంగాణలో అత్యధికంగా కేసులు నమోదవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర కలవరం చెందుతున్నారు.
ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 32438 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్ కాగా, ప్రస్తుతం 12,224 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 1831 మంది డిశ్చార్జ్ అయ్యారు.