భాగ్యనగరంలో విస్తరిస్తున్న కరోనా..ఏ జోన్‌లో ఎన్ని కేసులు

By సుభాష్  Published on  21 April 2020 11:33 AM GMT
భాగ్యనగరంలో విస్తరిస్తున్న కరోనా..ఏ జోన్‌లో ఎన్ని కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. నిన్న ఒక్క రోజు మాత్రమే రాష్ట్రంలో 14 కేసులు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్‌ విషయానికొస్తే నగరంలో ఇప్పటి వరకూ 399 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 8 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 51 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. కాగా, హైదరాబాద్‌ పోలీస్‌ లిమిట్స్‌లో జోన్లు వారిగా కరోనా కేసుల జాబితాను సీపీ విడుదల చేశారు. వెస్ట్‌ జోన్‌-సౌత్‌ జోన్‌లలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. వెస్ట్‌ జోన్‌లో -138, సౌత్‌ జోన్‌ -170, సెంట్రల్‌ జోన్‌ 45, ఈస్ట్‌ జోన్‌ -33 కేసులు కేసులు నమోదయ్యాయి.

ఇక నార్త్‌ జోన్‌ లో కరోనా ఇప్పటి వరకూ 13 కేసులు నమోదైనట్లు సీపీ వెల్లడించారు. కాగా, నగరంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు.

హైదరాబాద్‌ నగరంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నా కొందరు లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పోలీసులు ఎన్ని విధాలుగా చెప్పినా వినకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కొరఢా ఝులిపిస్తున్నారు. వాహనాలను సైతం సీజ్‌ చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు.ఇప్పటికే లక్షల కొద్ది వాహనాలు సీజ్‌ చేశారు. కరోనాను కట్టడి చేయాలంటే లాక్‌డౌన్‌ను తప్పనిసరిగ్గా పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరించిన వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో190 కంటైన్మెంట్ జోన్లు

కాగా, హైదరాబాద్‌లో కంటైన్‌మెంట్‌ జోన్‌లు శరవేగంగా పెరిగిపోతున్నాయి. అందు కారణం నగరంలో అధికంగా పాజిటివ్‌ కేసులు పెరగడమే. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 190 కంటైన్‌మెంట్‌ జోన్‌లుగా గుర్తించామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ జోన్లలో లాక్‌డౌన్‌ కఠినంగా అమలవుతోందని అధికారులు చెబుతున్నారు

Hyd

కంటైన్‌మెంట్‌ జోన్‌లలో పూర్తి స్థాయిలో సీలింగ్ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా కంటైన్‌మెంట్‌ జోన్‌లలో ఎవరు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని అంటున్నారు. హైదరాబాద్‌ నగరంలో ప్రతీ రోజు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆదోళన వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో 190 కంటైన్‌మెంట్‌ జోన్‌లు ఉన్నాయని, కనీసం 14 రోజుల వరకూ ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండగలిగితే కరోనాను అరికట్టవచ్చని చెబుతున్నారు.

కాగా, ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రార్థనల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. కరోనా వైరస్‌ తగ్గుతుందనుకునేలోపే మర్కజ్‌ ఉదాంతంతో మరింత ఆందోళన కలిగిస్తోంది.

Next Story