ఏపీలో కొత్తగా 35 కరోనా కేసులు

By సుభాష్  Published on  21 April 2020 7:24 AM GMT
ఏపీలో కొత్తగా 35 కరోనా కేసులు

ఏపీలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మంగళవారం ఏపీ ఆరోగ్యశాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 35 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 757 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇక 96 మందిని డిశ్చార్జ్‌ చేయగా, 22 మంది మృతి చెందారు. ప్రస్తుతం 639 మంది యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్‌-19 నుంచి నలుగురు కోలుకున్నారు. వీరిలో కర్నూలు నుంచి ముగ్గురు, నెల్లూరు నుంచి ఒకరు డిశ్చార్జ్‌ అయ్యారు.

కరోనా కేసులు అధికం కావడంతో ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో 97 మండలాలు రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్నట్లు ఇది వరకే జగన్‌ స‌ర్కార్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రెడ్‌జోన్లలో 14 రోజులపాటు పాజిటివ్‌ కేసు నమోదు కాకుంటే ఆ మండలాన్ని ఆరెంజ్‌ జోన్‌ కింద ప్రకటిస్తారు. ఆ రోజు నుంచి మరో 14 రోజులపాటు ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాకుంటే అప్పుడు గ్రీన్‌జోన్‌ పరిధిలోకి మండలం చేరినట్లు ప్రకటిస్తారు.

Next Story
Share it