హైదరాబాద్‌లో మరో టెన్షన్‌‌.. ఫుడ్‌ డెలివరీ బాయ్‌కి కరోనా..!

By సుభాష్  Published on  19 April 2020 8:46 AM GMT
హైదరాబాద్‌లో మరో టెన్షన్‌‌.. ఫుడ్‌ డెలివరీ బాయ్‌కి కరోనా..!

దేశంలో కరోనా వైరస్‌ అంతకంతకు పెరిగిపోతోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రార్థనల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ముందే హైదరాబాద్‌లో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో ఇప్పుడు మరో టెన్షన్‌ మొదలైంది.

నగంలో ఓ ఫుడ్‌ డెలివరీ బాయ్‌కి కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌ ఆర్డర్ల మీద ఫుడ్‌ డెలివరీ చేసే బాయ్‌కి కరోనా వైరస్‌ సోకడంతో ఇప్పుడు మరింత టెన్షన్‌ పెడుతోంది. ఫుడ్‌ డెలివరీ యాప్‌ సంస్థలో పని చేస్తున్న నాంపల్లికి చెందిన ఓ యువకుడికి కరోనా అని తెలిసినట్లు తెలుస్తోంది.

అయితే గడిచిన రెండు వారాల్లో అతడు ఏయే రెస్టారెంట్లలో ఫుడ్‌ ఆర్డర్లు తీసుకున్నాడు. ఎవరెవరి ఇళ్లకు డెలివరీ ఇచ్చాడన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. బాధితుడి ట్రావెల్‌ హిస్టరీని తెలుసుకుంటున్నారు. ఇప్పటికే అతని కుటుంబ సభ్యులను సైతం క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. నగరంలో ఫుడ్‌ డెలివరీ బాయ్‌కి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో హైదరాబాద్‌ వాసులకు మరింత భయాందోళన నెలకొంది.

Next Story