దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ముందుగా తగ్గుముఖంగా ఉన్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య.. ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్ నేపథ్యంలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో మర్కజ్‌కు వెళ్లినవారందరిని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు అధికారులు. ఇంకా కొందరు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇక మర్కజ్‌కు వెళ్లిన వారు ఎవరైన ఉంటే స్వచ్చంధంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. అయినా కొందరు తబ్లీగీలు తప్పించుకుని తిరుగుతున్నారు.

నేపథ్యంలో తప్పించుకుని తిరుగుతున్న తబ్లీగీల ఆచూకీ కనిపెట్టడంలో సహాయపడ్డ వారికి రూ. 10వేలు నజరానా అందజేస్తామని కార్పూరు పోలీసులు ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వాలు ఎన్నో హెచ్చరికలు జారీ చేసినా పెడచెవిన పెడుతున్నారు. వారు తప్పించుకుని తిరగడం వల్ల కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

మర్కజ్‌కు హాజరైన వారిలో కొందరు క్వారంటైన్‌కు రాకుండా తప్పించుకుని తిరిగే అవకాశం ఉందని ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌ మోహిత్‌ అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అధిక శాతం మర్కజ్‌కు వెళ్లినవారివేనని కేంద్రం ప్రకటించింది. మృతుల్లో కూడా ఎక్కువగా వారే ఉన్నారని తెలిపింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.