రాష్ట్రపతి భవన్‌కు తాకిన 'కరోనా' సెగ

By సుభాష్  Published on  21 April 2020 2:09 AM GMT
రాష్ట్రపతి భవన్‌కు తాకిన కరోనా సెగ

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దీంతో లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ, మర్కజ్‌ ఉదాంతం తర్వాత కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక ఢిల్లీలో కూడా కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఇప్పటికే రెండువేలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 47 మంది వరకూ మృతి చెందారు. ఇక అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతంగా ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఇక తాజాగా కరోనా సెగ రాష్ట్రపతి భవన్‌కు తాకినట్లు సమాచారం.

రాష్ట్రపతి భవన్‌లోపని చేసే ఒక పారిశుధ్య కార్మికుని బంధువుకు కరోనా పాజిటివ్‌ తేలినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ కార్మికుని కుటుంబ సభ్యులను 18వ తేదీనే క్వారంటైన్‌కు తలించారు. కాగా, కార్మికుని ఇంటి సమీపంలో ఉన్న 30 ఉద్యోగ కుటుంబాలు అధికారుల పర్యవేక్షణలో ఉన్నాయి. ఇక తాజాగా మరో 90 కుటుంబాల వరకూ క్వారంటైన్‌కు తరలించినట్లు సమాచారం.

లాక్‌డౌన్‌పై కేంద్రం సీరియస్‌

ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్‌ అయింది. పలు రాష్ట్రాల్లో సరిగ్గా అమలు చేయకపోవడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యవసరం కాని సేవలకు కూడా సడలించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. లాక్‌డౌన్ నిబంధనలు కఠినతరం చేయకపోవడంతో కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్రం హోంశాఖ లేఖ రాసింది. తక్షణమే రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ రూల్స్‌ కఠినతరం చేయాలని ఆదేశించింది.

Next Story