కేంద్ర ప్రభుత్వం వార్నింగ్

By సుభాష్  Published on  20 April 2020 2:34 AM GMT
కేంద్ర ప్రభుత్వం వార్నింగ్

కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా అతలాకుతలం చేస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఏప్రిల్ 14 వరకు ఉన్న లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించింది కేంద్రం. దీంతో రవాణా సౌకర్యంతో పాటు అన్ని విమాన సర్వీసులు సైతం నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ ముగింపు తేదీ దగ్గరపడున్న నేపథ్యంలో కొన్ని ఎయిర్ లైన్స్ దూకుడు ప్రవర్తిస్తున్నాయని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్‌డౌన్‌ ముగియకముందే విమాన ప్రయాణ టిక్కెట్లను జారీ చేయడంపై కేంద్రం మండిపడింది.

టిక్కెట్లను ఎప్పుడు జారీ చేయాలో కేంద్రం నిర్ణయించి ప్రకటించే వరకూ ఎలాంటి బుకింగ్‌లు ప్రారంభించవద్దని సూచించింది. టిక్కెట్ల బుకింగ్ ప్రారంభిస్తూ, తర్వాత వాటిని రద్దు చేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించింది. ఒక వేళ టిక్కెట్లను రద్దు చేస్తూ ప్రయాణికుల నుంచి ఎంతో కొంత డబ్బులు వసూలు చేసి, మిగతా వెనక్కి చెల్లిస్తున్నాయి. ఇలా చేసినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఈ మేరకు ఎయిర్‌లైన్‌ సంస్థలపై ఆదివారం హెచ్చరికలు జారీ చేసింది. కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చే వరకు విమాన ప్రయాణ టిక్కెట్ల బుకింగ్‌ ప్రారంభించవద్దని సూచించింది. టిక్కెట్ల జారీని ప్రారంభించడానికి విమానయాన సంస్థలకు సమయం, నోటీసులు ఇస్తామని పేర్కొంది.

Warning To Airlines1

పూర్తి అమౌంట్‌ వెనక్కి ఇచ్చేయాలి

కొన్ని ఎయిర్‌లైన్‌ సంస్థలు ప్రయాణికుల మొత్తాన్ని పూర్తిగా వెనక్కి చెల్లించకుండా కట్‌ చేస్తున్నారని కేంద్రం దృష్టికి రావడంతో మోదీ ప్రభుత్వం విమానయాన సంస్థలకు, టిక్కెట్‌ బుకింగ్‌ ఏజన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా మే 3 వరకూ లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో తర్వాత ఎత్తివేస్తుందనే ఉద్దేశంతో ఎయిర్‌లైన్‌ సంస్థలు ప్రయాణికులకు 4వ తేదీ నుంచి ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తూ టిక్కెట్ల బుకింగ్‌ ప్రారంభించింది. ఒకవేళ కరోనా అదుపులో రాకుంటే మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగించడమా.. సడలించడమా.. అనే ఆలోచనలో కేంద్రం ఉంది. ఈ నేపథ్యంలో విమాన టిక్కెట్లు జారీ చేయడంపై మోదీ సర్కార్‌ టిక్కెట్ ఏజన్సీలకు వార్నింగ్‌ ఇచ్చింది.

Next Story