దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో రెడ్‌జోన్‌, గ్రీన్‌ జోన్‌, ఆరెంజ్‌ జోన్లను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 170 జిల్లాలను కొవిడ్‌-19 హాట్‌స్పాట్లుగా కేంద్రం ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 11 జిల్లాలు, తెలంగాణలో 8 జిల్లాలు ఉన్నట్లు వెల్లడించింది

ఇక ఏపీ విషయానికొస్తే.. రాష్ట్రంలో 97 మండలాలు రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్నట్లు జగన్‌ స‌ర్కార్‌ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం వరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల నమోదును అనుసరించి రెడ్‌జోన్‌ మండలాలను ఖరారు చేసింది. ఏపీ రాష్ట్రంలో మొత్తం 676 మండలాలు ఉన్నాయి. మండల కేంద్రం యూనిట్‌గా తీసుకుని రెడ్‌జోన్లలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లా కలెక్టర్లకు సూచించింది. అయితే రెడ్‌జోన్లలో 14 రోజులపాటు పాజిటివ్‌ కేసు నమోదు కాకుంటే ఆ మండలాన్ని ఆరెంజ్‌ జోన్‌ కింద ప్రకటిస్తారు. ఆ రోజు నుంచి మరో 14 రోజులపాటు ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాకుంటే అప్పుడు గ్రీన్‌జోన్‌ పరిధిలోకి మండలం చేరినట్లు ప్రకటిస్తారు.

రెడ్‌జోన్‌లో ఉన్న మండలాల వివరాలివీ..

1కర్నూలు పట్టణ
2కోడుమూరు
3ఉయ్యాలవాడ
4నంద్యాల
5బనగానపల్లి
6పాణ్యం
7ఆత్మకూరు
8నందికొట్కూరు
9శిరువెళ్ల
10చాగలమర్రి
11బేతంచెర్ల
12గడివేముల
13గుడూరు
14ఓర్వకల్లు
15అవుకు
16పెద్దకడుబూరు
17ఎమ్మిగనూరు

నెల్లూరు జిల్లాలో

1 నెల్లూరు
2తడ
3బోగోలు
4బాలాయపల్లె
5ఇందుకూరుపేట
6అల్లూరు
7వాకాడు
8నాయుడుపేట
9బుచ్చిరెడ్డిపాళెం
10కావాలి
11గూడురు
12కోవూరు
13ఓజిలి
14తోటపల్లిగూడూరు

ప్రకాశం జిల్లాలో..

1ఒంగోలు
2కనిగిరి
3చీరాల
4కారంచేడు
5కందుకూరు
6గుడ్లూరు
7కొరిసపాడు
8మర్కాపురం
9పొదిలి

గుంటూరు

1గుంటూరు
2నరసరావుపేట
3మాచర్ల
4అచ్చంపేట
5మంగళగిరి
6పొన్నూరు
7చేబ్రోలు
8దాచేపల్లి
9కారంపూడి
10క్రోసూరు
11మేడికొండూరు
12తాడేపల్లి

పశ్చిమగోదావరి

1ఏలూరు
2భీమడోలు
3పెనుగొండ
4నరసాపురం
5భీమవరం
6తాడేపల్లిగూడెం
7ఆకివీడు
8ఉండి
9కొవ్వూరు

తూర్పుగోదావరి

1అడ్డ తీగల
2రాజమండ్రి
3రాజమహేంద్రవరం
4పెద్దాపురం
5శంఖవరం
6కొత్తపేట
7కాకినాడ
8పిఠాపురం

చిత్తూరు

1శ్రీకాళహస్తి
2తిరుపతి
3రేణిగుంట
4నగరి
5ఏర్పేడు
6నిండ్ర
7పలమనేరు
8వడమాలపేట

కడప

1ప్రొద్దుటూరు
2పులివెందుల
3కడప
4బద్వేలు
5మైదుకూరు
6వేంపల్లె
7ఎర్రగుంట్ల

కృష్ణా

1విజయవాడ
2మచిలీపట్నం
3నూజివీడు
4పెనమలూరు
5జగ్గయ్యపేట

అనంతపురం

1హిందూపురం
2కళ్యాణదుర్గం
3కొత్తచెరువు
4సెట్టూరు
5అనంతపురం

విశాఖ

1విశాఖ
2నర్సీపట్నం
3పద్మనాభం

ఒక వేళ కేసులు నమోదైతే గ్రీన్‌ జోన్‌ మండలాలు రెడ్‌ జోన్‌లోకి వెళ్తాయి. ఈనెల 20వ తేదీ నుంచి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను జిల్లాల్లో అమలు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించింది ప్రభుత్వం.

సుభాష్

.

Next Story