ఏపీలో 97 రెడ్ జోన్ మండలాలు
By సుభాష్ Published on 19 April 2020 10:41 AM GMTదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో రెడ్‌జోన్, గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్లను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 170 జిల్లాలను కొవిడ్-19 హాట్‌స్పాట్లుగా కేంద్రం ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 11 జిల్లాలు, తెలంగాణలో 8 జిల్లాలు ఉన్నట్లు వెల్లడించింది
ఇక ఏపీ విషయానికొస్తే.. రాష్ట్రంలో 97 మండలాలు రెడ్‌జోన్ పరిధిలో ఉన్నట్లు జగన్ సర్కార్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల నమోదును అనుసరించి రెడ్‌జోన్ మండలాలను ఖరారు చేసింది. ఏపీ రాష్ట్రంలో మొత్తం 676 మండలాలు ఉన్నాయి. మండల కేంద్రం యూనిట్‌గా తీసుకుని రెడ్‌జోన్లలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లా కలెక్టర్లకు సూచించింది. అయితే రెడ్‌జోన్లలో 14 రోజులపాటు పాజిటివ్ కేసు నమోదు కాకుంటే ఆ మండలాన్ని ఆరెంజ్ జోన్ కింద ప్రకటిస్తారు. ఆ రోజు నుంచి మరో 14 రోజులపాటు ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాకుంటే అప్పుడు గ్రీన్‌జోన్ పరిధిలోకి మండలం చేరినట్లు ప్రకటిస్తారు.
రెడ్‌జోన్‌లో ఉన్న మండలాల వివరాలివీ..
1 | కర్నూలు పట్టణ |
2 | కోడుమూరు |
3 | ఉయ్యాలవాడ |
4 | నంద్యాల |
5 | బనగానపల్లి |
6 | పాణ్యం |
7 | ఆత్మకూరు |
8 | నందికొట్కూరు |
9 | శిరువెళ్ల |
10 | చాగలమర్రి |
11 | బేతంచెర్ల |
12 | గడివేముల |
13 | గుడూరు |
14 | ఓర్వకల్లు |
15 | అవుకు |
16 | పెద్దకడుబూరు |
17 | ఎమ్మిగనూరు |
నెల్లూరు జిల్లాలో
1 | నెల్లూరు |
2 | తడ |
3 | బోగోలు |
4 | బాలాయపల్లె |
5 | ఇందుకూరుపేట |
6 | అల్లూరు |
7 | వాకాడు |
8 | నాయుడుపేట |
9 | బుచ్చిరెడ్డిపాళెం |
10 | కావాలి |
11 | గూడురు |
12 | కోవూరు |
13 | ఓజిలి |
14 | తోటపల్లిగూడూరు |
ప్రకాశం జిల్లాలో..
1 | ఒంగోలు |
2 | కనిగిరి |
3 | చీరాల |
4 | కారంచేడు |
5 | కందుకూరు |
6 | గుడ్లూరు |
7 | కొరిసపాడు |
8 | మర్కాపురం |
9 | పొదిలి |
గుంటూరు
1 | గుంటూరు |
2 | నరసరావుపేట |
3 | మాచర్ల |
4 | అచ్చంపేట |
5 | మంగళగిరి |
6 | పొన్నూరు |
7 | చేబ్రోలు |
8 | దాచేపల్లి |
9 | కారంపూడి |
10 | క్రోసూరు |
11 | మేడికొండూరు |
12 | తాడేపల్లి |
పశ్చిమగోదావరి
1 | ఏలూరు |
2 | భీమడోలు |
3 | పెనుగొండ |
4 | నరసాపురం |
5 | భీమవరం |
6 | తాడేపల్లిగూడెం |
7 | ఆకివీడు |
8 | ఉండి |
9 | కొవ్వూరు |
తూర్పుగోదావరి
1 | అడ్డ తీగల |
2 | రాజమండ్రి |
3 | రాజమహేంద్రవరం |
4 | పెద్దాపురం |
5 | శంఖవరం |
6 | కొత్తపేట |
7 | కాకినాడ |
8 | పిఠాపురం |
చిత్తూరు
1 | శ్రీకాళహస్తి |
2 | తిరుపతి |
3 | రేణిగుంట |
4 | నగరి |
5 | ఏర్పేడు |
6 | నిండ్ర |
7 | పలమనేరు |
8 | వడమాలపేట |
కడప
1 | ప్రొద్దుటూరు |
2 | పులివెందుల |
3 | కడప |
4 | బద్వేలు |
5 | మైదుకూరు |
6 | వేంపల్లె |
7 | ఎర్రగుంట్ల |
కృష్ణా
1 | విజయవాడ |
2 | మచిలీపట్నం |
3 | నూజివీడు |
4 | పెనమలూరు |
5 | జగ్గయ్యపేట |
అనంతపురం
1 | హిందూపురం |
2 | కళ్యాణదుర్గం |
3 | కొత్తచెరువు |
4 | సెట్టూరు |
5 | అనంతపురం |
విశాఖ
1 | విశాఖ |
2 | నర్సీపట్నం |
3 | పద్మనాభం |
ఒక వేళ కేసులు నమోదైతే గ్రీన్ జోన్ మండలాలు రెడ్ జోన్‌లోకి వెళ్తాయి. ఈనెల 20వ తేదీ నుంచి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను జిల్లాల్లో అమలు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించింది ప్రభుత్వం.