ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాలకు విపత్తు నిర్వహణ సంస్థ వర్ష హెచ్చరిక జారీ చేసింది. అలాగే.. పలనాడు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అప్రమత్తం చేశారు. జిల్లాలోని మాచర్ల, రెంటచింతల, గురజాల, దాచేపల్లి, వెల్దుర్తి, దుర్గ, కారెంపూడి, పిడుగురాళ్ల, బొల్లాపల్లి మండలాలతో పాటు పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.
అలాగే వై.రామవరం, మారేడుమిల్లి, రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల, దేవీపట్నంతో పాటు గోకవరం, కోరుకొండ, జగ్గంపేట, ఏలేశ్వరం, వీరబల్లి, రామాపురం, రాయచోటి చిన్నమండెం, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమతో పాటు కోస్తా, ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఈదురు గాలులు వీచాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో వర్షం కురుస్తోంది. పిడుగులు పడే సమయంలో రైతులు, కూలీలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.