మొంథా తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. ఆర్టీజీఎస్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఉదయం నుంచి కూర్చొని సూచనలు చేస్తున్నారని.. గత రెండు రోజుల నుండి అధికారులందరినీ అలెర్ట్ చేశామని తెలిపారు. సముద్రంలో ఉన్న మత్య్స్యకారులను వెనక్కి పిలిపించామని.. 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. ఈ రోజు రాత్రి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ సురక్షిత స్థానాలకు తరలించామని.. ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్దంగా ఉందని తెలిపారు.