రేపు ఈ జిల్లాల్లో వ‌ర్షాలు

ఉత్తరాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

By -  Medi Samrat
Published on : 10 Oct 2025 7:50 PM IST

రేపు ఈ జిల్లాల్లో వ‌ర్షాలు

ఉత్తరాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో శనివారం అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కోనసీమ(జి) నగరంలో 46మిమీ, మలికిపురంలో 36.2మిమీ, ప్రకాశం(జి) నర్సింగోలు27మిమీ, కాకినాడ(జి) డి.పోలవరంలో 25.5మిమీ,కోనసీమ(జి) అంబాజీపేటలో 21.7మిమీ వర్షపాతం నమోదైందని తెలిపారు.

Next Story