ఏప్రిల్ 12 నుండి 14 వరకు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ అంచనా వేసింది. ఉరుములతో కూడిన వర్షాలు మాత్రమే కాకుండా మెరుపులతో కూడా వర్షాలు, కుంభవృష్టికి కూడా అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్ నగరంలో ఏప్రిల్ 16 వరకు పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని IMD అంచనా వేసింది.
వచ్చే బుధవారం వరకు ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఉంటాయని కూడా అంచనా వేసింది. ముషీరాబాద్‌లో అత్యధికంగా 39.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ శాఖ ఏప్రిల్ 14 వరకు తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 43.3 డిగ్రీల సెల్సియస్ నిజామాబాద్‌లో నమోదైంది.