తెలంగాణకు వర్ష సూచన.. హైదరాబాద్ లో వాతావరణం ఎలా ఉండబోతోందంటే?

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుందని.. ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది

By Medi Samrat  Published on  7 May 2024 5:46 AM GMT
తెలంగాణకు వర్ష సూచన.. హైదరాబాద్ లో వాతావరణం ఎలా ఉండబోతోందంటే?

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుందని.. ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. ఈరోజు మాత్రమే కాకుండా మే 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో ఈరోజు తెల్లవారుజాము నుంచే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. IMD హైదరాబాద్ ప్రకారం, పగటిపూట ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్‌తో పాటు, తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాలు ఈరోజు వర్షపాతాన్ని చూడబోతున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని.. ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) గణాంకాల ప్రకారం జగిత్యాలలో అత్యధికంగా అంటే 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ విషయానికొస్తే.. అత్యధికంగా షేక్‌పేటలో 43.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

Next Story