తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాలు.. ఏపీలో కూడా..

Heavy rains in AP and Telangana for the next four days. వచ్చే నాలుగు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్‌ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

By అంజి  Published on  5 Sep 2022 2:13 AM GMT
తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాలు.. ఏపీలో కూడా..

వచ్చే నాలుగు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్‌ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ నిర్మల్‌, నల్గొండ, సూర్యపేట, జగిత్యాల, కరీంగనర్‌, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడే భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.

ఆగ్నేయ మధ్యప్రదేశ్‌ నుంచి మరా‌ఠ్వాడ, మధ్య మహా‌రాష్ట్ర, అంత‌ర్గత కర్ణా‌టక మీదుగా కొమో‌రిన్‌ ప్రాంతం వరకు సముద్ర మట్టా‌నికి 0.9 కిలో‌మీ‌టర్ల ఎత్తు వరకు ఉత్తర-ద‌క్షిణ ద్రోణి కొన‌సా‌గు‌తు‌న్నదని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభా‌వంతో ఈ నెల 8 వరకు వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నదని వివ‌రిం‌చింది.

మంగళవారం నిర్మల్‌, జగిత్యాల, కరీంనగర్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ కూడా రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజులపాటు తేలికాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవవచ్చని తెలిపింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు.

Next Story
Share it