భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..!

తెలంగాణలో రాగల నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది

By Medi Samrat
Published on : 16 July 2025 9:15 PM IST

భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..!

తెలంగాణలో రాగల నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ బలమైన ఈదురుగాలులతో వానలు పడే అవకాశాలున్నాయని, గురువారం నల్గొండ, సూర్యాపేట, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి.

ఇక శుక్రవారం, శనివారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని వివరించింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Next Story