హైదరాబాద్‍లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. అమీర్ పేట్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఎల్బీనగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెంట్, ఎర్రగడ్డ, బోరబండ ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మంగళవారం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నెల 25న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఈనెల 26న వాయుగుండంగా బలపడనుందని తెలిపింది. 27న వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది.