ఏపీలో రాబోయే మూడురోజులు విస్తారంగా వ‌ర్షాలు

AP Weather Update. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఒడిశా- ఉత్తరాంధ్ర తీరం వెంబడి

By Medi Samrat  Published on  28 Aug 2021 10:48 AM GMT
ఏపీలో రాబోయే మూడురోజులు విస్తారంగా వ‌ర్షాలు

వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఒడిశా- ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీడనం ఏర్ప‌డింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మంగళవారం వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయ‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. అల్పపీడనం ప్ర‌భావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని హెచ్చ‌రించారు. రేపు రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయ‌ని వెల్ల‌డించారు. తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వేగంతో గాలులు వీస్తున్నందున.. సముద్రం అలజడిగా ఉంటుందని.. రేపటి వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చ‌రించారు.


Next Story