బీ అలర్ట్‌.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ ఆగ్నేయ,తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది.

By -  అంజి
Published on : 24 Oct 2025 7:53 AM IST

Bay of Bengal, Heavy rains, Telugu states, Telangana, APNews, APSDMA, IMD hyderabad

బీ అలర్ట్‌.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ ఆగ్నేయ,తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. తదుపరి 24 గంటల్లో పశ్చిమవాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. బుధవారం వరకు వర్ష సూచన ఉందని, సోమ, మంగళవారల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నేడు కోనసీమ, కృష్ణా, గుంటూరు,బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో మంత్రులు నిమ్మల రామానాయుడు,వంగలపూడి అనిత టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని కలెక్టర్లకు అందిచాలని ఏపీఎస్డీఎంఏను ఆదేశించారు. మండల కంట్రోల్ రూమ్స్ లో రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యుఎస్,విద్యుత్ శాఖ అధికారులను ఉంచాలని, క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అలెర్ట్ గా ఉండాలన్నారు.

తెలంగాణలో కూడా భారీ వర్షాలు

అటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఖమ్మం, మెదక్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Next Story