కోహ్లీతో మంచిగా ఉంటేనే ఐపీఎల్ కాంట్రాక్టులు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన లక్ష్మణ్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 April 2020 7:46 AM GMTఆస్ట్రేలియా క్రికెటర్లు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో మంచిగా వ్యవహరించి ఎంలో విలువైన ఐపీఎల్ కాంట్రాక్ట్‌లు దక్కించుకునేందుకు ప్రయత్నించారని.. అందులో భాగంగానే కోహ్లీని స్లెడ్జింగ్ చేయడానికి బయపడ్డారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ ఆరోపించిన విషయం తెలిసిందే.
అయితే.. క్లార్క్ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ పైర్ అయ్యారు. కోహ్లీతో మంచిగా ఉండటం చేత ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఐపీఎల్ కాంట్రాక్టులు వస్తాయనేది హాస్యాస్పదమని అన్నారు.
భారత జట్టు ఆటగాళ్లతో మంచిగా ఉన్నంత మాత్రాన ఐపీఎల్‌లో అవకాశం దక్కదు. ఏ ఫ్రాంఛైజీ అయినా ఆటగాడిని తీసుకునే ముందు అతడి సామర్థ్యం, అతని వల్ల జట్టుకు ఎంత ఉపయోగం అనేది చూస్తుంది. అయినా మ్యాచ్ విన్నర్‌లైన ఆటగాళ్ల వైపే ఫ్రాంఛైజీలు మొగ్గు చూపుతాయని.. ఆ సత్తా వున్న ఆటగాళ్లకే ఐపీఎల్ కాంట్రాక్టులు దక్కుతాయని.. అంతే కానీ.. ఒకరితో మంచిగా ఉంటే కాంట్రాక్టులు దక్కవని లక్ష్మణ్ అన్నారు.
ఓ విదేశీ ప్లేయర్.. భారత ఆటగాడితో స్నేహంగా ఉన్నాడంటే.. అతడికి ఐపీఎల్ కాంట్రాక్టు వస్తుందని కాదు. ఓ టీం మెంటర్(సన్‌రైజర్స్)గా నేను ఐపీఎల్ వేలంలో పాల్గొన్నా. ఆయా దేశాల జట్లలో సత్తా చాటిన ఆటగాళ్లనే మేం ఎంపిక చేశాం. అంతేకాని.. విరాట్ కోహ్లీతో మంచిగా ఉన్నారని ఎవరికి కాంట్రాక్టులు దక్కలేదని లక్ష్మణ్ క్లార్క్‌పై మండిపడ్డాడు.
ఇదిలావుంటే.. క్లార్క్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. భారత మాజీ ఓపెనర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్, ఆస్ట్రేలియా కెప్టెన్ పైన్ క్లార్క్ వ్యాఖ్యలను ఖండించారు. క్లార్క్ వ్యాఖ్యలు హస్యాస్పదమని శ్రీకాంత్ కొట్టిపారేయగా.. గేమ్ ప్లాన్‌లో భాగంగానే కోహ్లీని స్లెడ్జింగ్ చేయలదని పైన్.. క్లార్క్‌కు గట్టిగానే పమాధానమిచ్చాడు.