ప్రియురాలు చేసిన ప‌నికి సిగ్గుప‌డుతున్న హార్థిక్‌.. వీడియో వైర‌ల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 April 2020 10:41 AM GMT
ప్రియురాలు చేసిన ప‌నికి సిగ్గుప‌డుతున్న హార్థిక్‌.. వీడియో వైర‌ల్

క‌రోనా వైర‌స్ దెబ్బ‌కి క్రీడారంగం కుదేలైంది. క‌రోనా ముప్పుతో ప‌లు టోర్నీలు వాయిదా ప‌డ‌గా.. మ‌రికొన్ని ర‌ద్దు అయ్యాయి. దీంతో క్రీడాకారులంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. త‌మ‌కు దొరికిన ఈ విరామాన్ని కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి హాయిగా గ‌డుపుతున్నారు.

ఎప్పుడు బీజీ క్రికెట్‌తో ఉండే టీమ్ఇండియా క్రికెట‌ర్లు.. క‌రోనా సెల‌వుల‌ను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప‌రిమిత ఓవ‌ర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, టీమిండియా ఫాస్టు బౌల‌ర్ జ‌ప్‌ప్రీత్ బుమ్రాలు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అభిమానులు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను చెబుతున్నారు.

తాజాగా టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ హార్థిక్ పాండ్యా తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశాడు. అందులో ఈ ఆల్‌రౌండ‌ర్ సిగ్గు ప‌డుతున్నాడు. దీంతో ఈ వీడియో వైర‌ల్‌గా మారిది. త‌న‌కు కాబోయే భార్య న‌టాషా స్టాన్‌వికోవిచ్ హిందీ నేర్పిస్తున్నాడు హార్థిక్‌. ‘బేబీ.. నేను నీకు ఏమౌతాను’ అని హార్థిక్ అడగ్గా దానికి నటషా వచ్చిరాని హిందీలో సమాధానం ఇచ్చింది. 'నువ్వే నా ప్రాణం' అని సమాధానం ఇచ్చింది. న‌టాషా స‌మాధానం విని హార్థిక్ తెగ సిగ్గుప‌డిపోయాడు. ఈ వీడియోను పాండ్య త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెటింట్లో వైర‌ల్ గా మారింది.ఈ ఏడాది కొత్త సంవత్సరం వేడుకలో భాగంగా దుబాయ్‌ వెళ్లిన హార్థిక్ అక్కడే సెర్బియా నటి నటాషాను నిశ్చితార్థం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

Next Story
Share it