త‌న‌కంటే 30 ఏళ్ల చిన్నోడితో.. స్టార్ పుట్‌బాల‌ర్ త‌ల్లి డేటింగ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 April 2020 4:15 PM GMT
త‌న‌కంటే 30 ఏళ్ల చిన్నోడితో.. స్టార్ పుట్‌బాల‌ర్ త‌ల్లి డేటింగ్

ప్రేమ‌కు గుడ్డిదని, వ‌య‌సుతో సంబంధం లేద‌ని, అది ఎప్పుడు ఎలా ఎవ‌రి పై పుడుతుందో చెప్ప‌లేమ‌ని అంటుంటారు. తాజాగా త‌న కంటే.. వ‌య‌సులో 30 ఏళ్ల చిన్న‌వాడితో.. ఓ స్టార్ పుట్‌బాల‌ర్ త‌ల్లి డేటింగ్ చేస్తోంది.

బ్రెజిల్‌ స్టార్‌ ఫుట్‌బాలర్ నెయ్‌మార్‌ తల్లి నడీనె గొంజాల్వెస్‌ (52) లేటు వయసులో ఘాటు ప్రేమ‌లో పడింది. ఆ కుర్రాడి వ‌య‌సు 22. తన కొడుకు క‌న్నా ఆరేళ్ల చిన్న‌వాడు కావ‌డం విశేషం. దీంతో ఈ ప్రేమ వ్య‌వ‌హారం హాట్ టాఫిక్‌గా మారింది. కాగా ఆ యువ‌కుడు నెయ్‌మార్ కు వీరాభిమాని.

నెయ్‌మార్‌ తల్లి నడీనె గొంజాల్వెస్ నాలుగేళ్ల క్రితమే భర్త సీనియర్ నెమార్ సాంటోస్‌తో విడాకులు తీసుకుంది. ఆత‌రువాత టియాగొ రమోస్‌ అనే 22 ఏళ్ల యువకుడితో ప్రేమ‌లో ప‌డింది. ప్ర‌స్తుతం వీరిద్ద‌రు డేటింగ్‌లో ఉన్నారు. కాగా.. తాజాగా న‌డీనె గొంజాల్వెస్ ఓ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. దీంతో వీరిద్ద‌రి బంధం ప్ర‌పంచానికి తెలిసింది. తమ బంధాన్ని వివరించలేం.. మమ్మల్ని వదిలేయండి అని ఆఫోటో కింద రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

కాగా.. ఈ ఫోటోపై నెయ్‌మార్ స్పందించాడు. 'కొత్త బంధంలో సంతోషంగా ఉండు అమ్మా' అని నెయ్‌మార్ కామెంట్ చేశాడు. కరోనా కట్టడికి నెయ్‌మార్ 10ల‌క్ష‌ల డాల‌ర్ల విరాళం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌న క‌రెన్సీలో రూ. 7,64, 18,241.

Next Story
Share it