Fact Check : ఆ వీడియోలు ఈ మధ్య చోటుచేసుకున్న గొడవవేనా..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Jun 2020 1:20 PM ISTలడఖ్ లోని గల్వాన్ లోయలో ఇటీవల భారత్-చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న గొడవలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించింది. భారత్ కు చెందిన సైనికులు 20 మంది చనిపోగా.. చైనా సైనికులు 35 మంది కంటే ఎక్కువ చనిపోయారని చెబుతున్నారు. వీరమరణం పొందిన భారత సైనికులకు ప్రజలు నివాళి అర్పించారు. భారత్-చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న గొడవకు సంబంధించిన వీడియోలు అంటూ పలు వీడియోలు సామాజికమాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.
Chinese and Indian soldiers clash on border!
Soldiers from China and India clashed with stones and sticks on the Ladakh Border in the Kashmir region. pic.twitter.com/Q7MyeJPXXo
— Farhang F. Namdar (@FarhangNamdar) May 28, 2020
రాళ్లతో దాడి చేసుకుంటున్న వీడియోలు.. ఇలా పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ వస్తున్నారు.
నిజ నిర్ధారణ:
భారత్-చైనా సైనికుల మధ్య ఇటీవల చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించిన వీడియోలు 'ఇవి కావు'.
వీడియోలకు సంబంధించిన కీఫ్రేమ్స్ ను గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ వీడియోలు గత మూడేళ్లుగా సర్క్యులేషన్ లో ఉన్నాయి.
చైనా-భారత్ సైనికుల మధ్య గొడవలకు సంబంధించిన వీడియో ఆగస్టు 19, 2017లో చోటుచేసుకున్నది. పాంగోంగ్ త్సో లేక్ వద్ద ఈ ఘటన అప్పట్లో చోటుచేసుకుంది.
https://theprint.in/report/visuals-show-india-china-clash-at-ladakh-was-serious-troops-injured/7015/
ఆపరేషన్ వాలిదాద్ పాక్ ఆర్మీ అంటూ కొన్ని విజువల్స్ ను గతంలోనే అప్లోడ్ చేశారు.
‘Pakistan army wounded Operation Walidad’ కీవర్డ్స్ ను ఉపయోగించి చూడగా నవంబర్ 2011కు సంబంధించిన విజువల్స్, న్యూస్ కనిపించాయి. Military.com అనే వెబ్సైట్ వీడియోలను షేర్ చేసి.. ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన తాలిబన్ లకు పాకిస్థాన్ సైనికులకు మధ్య దక్షిణ వజీరిస్థాన్ లో యుద్ధం జరిగిందని.. పాక్ సైన్యం ఎక్కువగా గాయపడిందని వార్తలు రాసుకుని వచ్చారు.
మొహమంద్ ఏజెన్సీ లోని వాలిదాద్ నుండి టెర్రరిస్టులను పారద్రోలడానికి పాకిస్థాన్ ఆర్మీ, పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్ ను చేపట్టాయి. ముగ్గురు పాక్ సైనికులు చనిపోగా.. 25 మంది మిలిటెంట్లు హతమయ్యారని హిందుస్థాన్ టైమ్స్, ట్రిబ్యూన్ లలో కథనాలు కూడా వెలువడ్డాయి.
https://tribune.com.pk/story/192120/checkpost-attack-7-killed-in-mohmand-agency/
సామాజిక మాధ్యమాల్లో చైనా-భారత్ కు చెందిన సైనికుల మధ్య చోటుచేసుకున్న గొడవాలంటూ వైరల్ అవుతున్న వీడియోలు పచ్చి అబద్ధం. ఈ వీడియోలు ఇప్పటివి కానే కావు.