గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న గొడవలో భారత్ కు చెందిన 20 మంది సైనికులు మరణించారు. తెలంగాణకు చెందిన సంతోష్ బాబు కూడా ఈ గొడవల్లో మరణించారు. ఆయనకు పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు.

సామాజిక మాధ్యమాల్లో సంతోష్ బాబు కుమార్తె ఆయన ఫొటోకు నివాళులు అర్పిస్తోంది అంటూ ఓ పిక్ వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ఓ అమ్మాయి రెండు చేతులతో నమస్కారం చేస్తూ ఉండగా.. ముందు చెయిర్ లో సంతోష్ బాబు ఫోటో ఉంది.

“Daughter of Colonel Santosh Babu, 16 Bihar Regiment who lost his life during a violent face-off between #India & #China. Salute to the Brave Hearts #IndianArmy Soldiers.” అంటూ ట్విట్టర్ లో పలువురు పోస్టులు పెడుతూ వస్తున్నారు. కల్నల్ సంతోష్ బాబు కుమార్తె తన తండ్రి చిత్రపటానికి నమస్కారం చేస్తోందని పలువురు ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసారు.

కొన్ని న్యూస్ ఛానల్స్ కు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ లలో కూడా ఈ ఫోటోలను, వీడియోలను షేర్ చేశారు. వాటిలో కూడా సంతోష్ బాబు కుమార్తె అంటూ రాసుకొని వచ్చారు.

ఫేస్ బుక్ లో కూడా ఇదే విషయాన్ని రాసి వైరల్ చేశారు.

టైమ్స్ నౌ న్యూస్ యాంకర్ Navika Kumar కూడా ఈ విషయాన్ని షేర్ చేసింది.

“Martyred Indian Soldier Santosh Babu’s daughter pays tribute to her father.” అంటూ డెక్కన్ క్రానికల్ లో ఫోటోను షేర్ చేశారు.

A1

Free Press Journal కూడా ఇదే విషయాన్ని తమ ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు.

నిజ నిర్ధారణ:

ఈ ఫోటోను గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ ఫోటోను అఖిల భారతీయ విద్యార్థి పరిషద్(ఎబివిపి) మొదట ట్వీట్ చేసింది.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్నది కల్నల్ సంతోష్ బాబు కుమార్తెగా అనుకున్నారని.. కొన్ని మీడియా సంస్థలు కూడా పొరబడ్డాయని.. ఆ ఫోటోలో ఉన్నది కర్ణాటకకు చెందిన ఓ ఎబివిపి కార్యకర్త చెల్లెలు అని చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశారు.

కర్ణాటక రాష్ట్రం నెలమంగళకు చెందిన ఎబివిపి కార్యకర్త చెల్లెలు ఆమె అంటూ మరిన్ని ఫోటోలను ట్వీట్ చేశారు.

ఎబివిపి కర్ణాటక ట్విట్టర్ అకౌంట్ లో ఆ అమ్మాయి పేరు కుమారి మనశ్రీ అని.. నెలమంగళలో సంతోష్ బాబుకు నివాళి అర్పిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆ అమ్మాయి వచ్చిందని.. అక్కడ తీసిన ఫోటో అని వివరణ ఇచ్చారు.

అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం కల్నల్ సంతోష్ బాబుకు తొమ్మిది సంవత్సరాల కుమార్తె అభిజ్ఞ, కుమారుడు అనిరుధ్ ఉన్నారు.

సంతోష్ బాబు కుమార్తె తన తండ్రి ఫోటోకు నివాళులు అర్పిస్తోంది అన్నట్లుగా వైరల్ అవుతున్న ఫోటోలు 'నిజం కావు'. ఆ ఫోటోలో ఉన్నది కర్ణాటకకు చెందిన ఎబివిపి కార్యకర్త చెల్లెలు.

Claim Review :   Fact Check : సంతోష్ బాబుకు నివాళులు అర్పిస్తున్న అమ్మాయి.. ఆయన కుమార్తేనా.?
Claimed By :  Unknown
Fact Check :  false

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story