Fact Check : చైనీయులు భారతీయులకు క్షమాపణలు చెబుతూ ట్వీట్లు చేశారా.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Jun 2020 11:16 AM GMT
Fact Check : చైనీయులు భారతీయులకు క్షమాపణలు చెబుతూ ట్వీట్లు చేశారా.?

చైనా-భారత్ సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన గొడవలో 20 మంది భారత సైనికులు ప్రాణాలను కోల్పోయారు. చైనాకు చెందిన అమ్మాయిలు గల్వాన్ లోయలో చోటుచేసుకున్న ఘటనలకు క్షమాపణలు చెబుతూ చేసిన ట్వీట్లు బాగా వైరల్ అయ్యాయి.

హిందూ గో సేవా సమితి అనే ఫేస్ బుక్ పేజీలో కొన్ని ట్వీట్లకు చెందిన స్క్రీన్ షాట్ లను పోస్టు చేశారు. 'గల్వాన్ లోయలో 180 మంది చైనా సిపాయిలు చనిపోయారని.. ముగ్గురు కమాండర్లు కూడా చనిపోయిన వారిలో ఉన్నారని.. చైనా ప్రజల గురించి అసలు పట్టించుకోదని.. గల్వాన్ లోయ భారత్ కు చెందినదేనని చైనా ప్రజలకు తెలుసునని.. జిన్ పింగ్ దేశభక్తి మత్తులో ప్రజలను మోసం చేయాలని అనుకుంటున్నాడు' అని ఆ వైరక్ ట్వీట్ లో ఉంది.

పలు సామాజిక మాధ్యమాల్లో పలువురు దీన్ని షేర్ చేశారు.



Mo Chou Hong Kong పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ నుండి కూడా చైనాకు వ్యతిరేకంగా పలు ట్వీట్లు వెలువడ్డాయి. 'చైనీస్ గా పిలిపించుకోడానికి ఎంతగానో బాధపడుతూ ఉన్నానని.. జి పింగ్ డిక్టేటర్ లా ప్రవర్తిస్తూ ఉంటాడని. ప్రజల గురించి అసలు ఆలోచించడని.. తాను కూడా #FreeHongKong కోసం పోరాడుతూ ఉన్నానని.. తాను చైనా డిక్టేటర్ షిప్ కు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నానని.. తనకు మద్దతుగా నిలవాలంటూ' ఆ ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్టు చేశారు.

C1

నిజ నిర్ధారణ:

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పై ఫోటోలు చైనా యువతులకు చెందినవి కావు. చైనా యువతులు తమ దేశంపై తీవ్ర ఆరోపణలు చేశారన్నది 'పచ్చి అబద్ధం'

@wungchungbhonsda అనే ట్విట్టర్ అకౌంట్ ను పరిశీలించగా ‘If china can set a narrative then why we can’t ? . parody .’ అని ఉంది. ఇది ఒక పేరడీ అకౌంట్ అని క్లియర్ గా చెప్పేశారు. చాలా వరకూ భారత్ కు మద్దతుగా అందులో ట్వీట్లు చేశారు.

C2

Mo Chou Hong Kong ట్విట్టర్ అకౌంట్ కూడా ఫేక్ అకౌంట్ అని తేలిపోయింది. దీంతో ఆ అకౌంట్ ను ట్విట్టర్ నుండి తీసివేశారు. చైనీస్ యాక్ట్రెస్ శాంగ్ జెంగ్ ఫోటోలను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నారు.

C3

@BeingSunanda2 అనే పేరు నుండి ఈ మధ్యనే Mo Chou Hong Kong అంటూ పేరు మార్చుకుంది.

C4

ఈ అకౌంట్లు మాత్రమే కాకుండా ట్రంప్, ఇవాంకా, షింజో అబే, పుతిన్ లాంటి ప్రముఖుల పేరడీ అకౌంట్ల నుండి తామందరూ భారత్ కే మద్దతు తెలుపుతున్నామంటూ ట్వీట్లు వెలువడ్డాయి.







C5

కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చైనా అమ్మాయిల ట్వీట్లు 'పచ్చి అబద్ధం'. మరికొందరు ప్రముఖుల ట్వీట్లు పేరడీ అకౌంట్ల నుండి వెలువడ్డాయి.

Claim Review:Fact Check : చైనీయులు భారతీయులకు క్షమాపణలు చెబుతూ ట్వీట్లు చేశారా.?
Claim Fact Check:false
Next Story