Fact Check : తెలంగాణ ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి స్కూల్ ఫీజులు రద్దు చేసిందా.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Jun 2020 6:34 AM GMT
Fact Check : తెలంగాణ ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి స్కూల్ ఫీజులు రద్దు చేసిందా.?

లాక్ డౌన్ కారణంగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. ఇప్పటికే చాలా పాఠశాలలకు చెందిన టీచర్లు ఆన్ లైన్ లో క్లాసులు చెబుతూ వస్తున్నారు. ఆగష్టు నెలలో పాఠశాలలు మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం 2020-21కి సంబంధించిన స్కూల్ ఫీజులను రద్దు చేసిందని సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు వైరల్ అవుతోంది. స్కూల్స్ తల్లిదండ్రులను ఫీజుల కట్టమని అడగకూడదంటూ ఆ పోస్టులో పెట్టారు.

Kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని.. 2020-21 స్కూల్ ఫీజులను అడగకూడదని.. నెలవారీ నామినల్ ఫీజును మాత్రమే తల్లిదండ్రుల నుండి వసూలు చేయాలని.. అది కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా వసూలు చేయాలని ఆ ఫీజులు వసూలు చేయాలని అన్నారట. ఎటువంటి ఫిర్యాదులైనా వస్తే స్కూల్ లైసెన్స్ లు రద్దు చేసే అవకాశం ఉందని ఎడ్యుకేషన్ మినిస్టర్ తెలిపినట్లు అందులో ఉంది. ప్రీ కేజీ, ఎల్.కె.జి., యు.కె.జి., 1వ తరగతి నుండి 5వ తరగతి వరకూ ఆన్ లైన్ క్లాసెస్ రద్దు చేయమని కోరారు. ఆన్ లైన్ క్లాసులకు ఎటువంటి ఫీజులు అడగకూడదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజేయండి. ఈ రూల్స్ ను పాటించని స్కూల్స్ గురించి 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి. అన్న మెసేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

నిజ నిర్ధారణ:

న్యూస్ మీటర్ ఫేస్ బుక్ లో ఈ విషయమై సెర్చ్ చేయగా.. పలు పోస్టులు కనిపించాయి. అవి కూడా జూన్ 13, 2020 తర్వాత సామాజిక మాధ్యమంలో తెగ షేర్ చేశారు.

Kcr2

AZ News ఫేస్ బుక్ పేజీలో ఈ మెసేజీని పోస్టు చేశారు. ఆ సమాచారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీచ్ ను యాడ్ చేశారు. జూన్ 13, 6:33pm లో ఈ పోస్ట్ ను పబ్లిష్ చేశారు.

Kcr3

ఈ వీడియో కీ ఫ్రేమ్స్ ను తీసుకుని సెర్చ్ చేయగా కేసీఆర్ ఏప్రిల్ 19న మాట్లాడిన ప్రెస్ మీట్ కి సంబంధించిన వీడియో. అప్పటి ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాట్లాడుతూ.. 10000 స్కూల్స్ లో 30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 2020-21 విద్యాసంవత్సరంలో ఫీజులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ వసూలు చేయకండి. ఆ ఫీజు.. ఈ ఫీజు అంటూ వసూలు చేయకండి అని కొన్నిసూచనలు చేశారు. ఒకటేసారే సంవత్సరం మొత్తం ఫీజులను వసూలు చేయకండి.. నెల నెల కట్టించుకోండి అని సూచించారు. పూర్తీ ఫీజులు కట్టాలి అంటూ విద్యా సంస్థలు వేధిస్తే మాత్రం 100కి కాల్ చేయమని ఆరోజు ప్రెస్ మీట్ లో కేసీఆర్ తెలిపారు. అంతేకానీ ఫీజులు రద్దు చేయమని ఎక్కడ కూడా చెప్పలేదు.

తెలంగాణ ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరానికి గానూ.. ఎటువంటి ఫీజులు వసూలు చేయకూడదని విద్యాసంస్థలను కోరింది అన్న మెసేజీ 'పచ్చి అబద్ధం'. ప్రభుత్వం కేవలం స్కూల్ ఫీజులను పెంచవద్దు అని కోరింది. ట్యూషన్ ఫీజులను నెలవారీగా వసూలు చేయమని కోరింది.

ఇక ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రీ కేజీ నుండి ఐదో క్లాస్ వరకూ ఆన్ లైన్ క్లాసులను రద్దు చేయమని కోరడం కూడా పచ్చి అబద్ధం.

ఈ నిర్ణయం తీసుకున్నది కర్ణాటక ప్రభుత్వం మాత్రమే. జూన్ 10వ తేదీన ప్రీ కేజీ నుండి ఐదో క్లాస్ వరకూ ఆన్ లైన్ క్లాసులను రద్దు చేస్తున్నట్లు కర్ణాటక ఎడ్యుకేషన్ మినిస్టర్ సురేష్ కుమార్ తెలిపారు. ఆయా తరగతులకు ఆన్ లైన్ టీచింగ్ ను రద్దు చేస్తున్నామని.. ఎటువంటి ఫీజులను అడగకూడదని ఆదేశాలు జారీ చేశారు.

న్యూస్ మినిట్ లో కూడా ఈ వార్తకు సంబంధించిన లింక్ లను చూడొచ్చు

https://www.thenewsminute.com/article/karnataka-cancels-online-classes-students-class-5-126277

https://www.thenewsminute.com/article/live-virtual-and-pre-recorded-classes-stopped-students-till-class-5-karnataka-126348

తెలంగాణలో కూడా పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు లేకుండా చేయాలంటూ తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్స్ ఫర్ చైల్డ్ రైట్స్ అండ్ సేఫ్టీ కింద ఆన్ లైన్ పిటీషన్ ను వేశారు.

పిటీషన్ కు సంబంధించిన లింక్

https://change.org/p/telangana-ban-online-classes-for-children-from-kg-to-class-5-in-telangana?source_location=topic_page

ప్రీ కేజీ నుండి ఐదో క్లాస్ వరకూ ఆన్ లైన్ క్లాసులను రద్దు చేయమని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందన్నది పచ్చి అబద్ధం.

Claim Review:Fact Check : తెలంగాణ ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి స్కూల్ ఫీజులు రద్దు చేసిందా.?
Claim Fact Check:false
Next Story