శుక్రవారం జరిగిన రాజ్యసభ సభ్యుల ఎన్నికలో వైసీపీ క్లీన్ చిట్ ఇచ్చింది. మొత్తం నాలుగు సీట్లకు నాలుగు సీట్లు ఆ పార్టీనే దక్కించుకుంది. ఎటొచ్చి ఓటమి తప్పదని ముందే తెలుసుకున్న టీడీపీ..ఊహించినట్లుగా బరిలో నిలబడిన ఒక్క అభ్యర్థి కూడా ఓటమి పాలయ్యారు. టీడీపీ ఓటమి రెబల్ అభ్యర్థులు కూడా కారణమయ్యారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. వాళ్లు కావాలనే చెల్లని ఓట్లు వేసి..వైసీపీని పరోక్షంగా గెలిపించారని కొన్ని మీడియా సంస్థలు కోడై కోడై కూశాయి.

టీడీపీ అభ్యర్థి ఓటమి పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్ వేశారు. అది కూడా డైరెక్ట్ గా చంద్రబాబు పేరును ప్రస్తావిస్తూనే..బాబు తమ పార్టీ అభ్యర్థిని కించపరచాలన్న లక్ష్యంతోనే బలం తక్కువగా ఉన్న వ్యక్తిని బరిలో నిలబెట్టారన్నారు. వారిని అలా కించపరచడం సబబు కాదన్నట్లు రాసుకొచ్చారు విజయసాయి.

'' దళితులను ఇలా పనిగట్టుకుని ఎందుకు అవమానిస్తారు బాబు గారు. గెలిచే ఛాన్సే లేదని తెలిసి వర్ల రామ‌య్య‌ను పోటీలో పెట్టారు. గతంలో పుష్ప రాజ్, నర్మింహులు గార్లను ఇలాగే అవహేళన చేసారు. పదవి దక్కుతుందంటే కనకమేడల లాంటి మీ వాళ్లను బరిలోకి దింపుతారు. ఓటమి తప్పదంటే బలహీన వర్గాల వారిని బలిచేస్తారా ? అంటూ ప్ర‌శ్నించారు.న్యూస్‌మీటర్ తెలుగు

Next Story