న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  3 Oct 2020 3:33 PM IST
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

1.సొంత దళకమాండర్‌నే హతమార్చిన మావోయిస్టులు

సొంత దళకమాండర్‌నే మావోయిస్టులు హతమార్చిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని బస్తర్‌ రేంజ్‌ ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌ సుందర్‌రాజ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బీజాపూర్‌ జిల్లా గంగులూరు ఏరియాలో పలువురు ఆదివాసీలను మావోయిస్టులు హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్యల నేపథ్యంలో పలువురు అమాయక ఆదివాసీలు సైతం బలయ్యారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.Fact Check : కింద దొర్లుతూ రిపోర్టింగ్ ఇస్తున్న ఆ వీడియోలో ఉన్నది రావిష్ కుమారేనా..?

సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. కింద దొర్లుతూ మరీ రిపోర్టింగ్ ఇస్తున్న ఆ వీడియోలో ఉన్నది ప్రముఖ ఎన్.డి.టీ.వీ. జర్నలిస్టు రావిష్ కుమార్ అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఇందు తివారీ మొదట ఈ వీడియోను పోస్టు చేశారు. సెప్టెంబర్ 29, 2020న వీడియోను పోస్టు చేశారు. ‘ఈ వీడియోలో ఉన్న జర్నలిస్టును గుర్తు పట్టగలరా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3.ఈ లక్షణాలు ఉంటే కరోనా సోకినట్లే: బ్రిటన్‌ శాస్త్రవేత్తలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. వైరస్‌ ఎటువైపు నుంచి సోకుతుందో తెలియని పరిస్థితి. అయితే వైరస్‌ లక్షణాలు ఎన్నో బయటకు వస్తున్నాయి. ఒక్కో సమయంలో ఒక్కో విధంగా రూపాంతరం చెంది వ్యాప్తి చెందుతుంది. దీనిపై కూడా శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ఈ వైరస్‌ మరికొన్ని లక్షణాలను బయటపెట్టారు. పూర్తిగా వాసనను కోల్పోవడం, రుచిని కోల్పోవడం కరోనా వైరస్‌ సోకిందని చెప్పడానికి అత్యంత విశ్వసనీయ లక్షణమని.. పూర్తివార్త కోసం క్లిక్‌ చేయండి

4.సీఎం జగన్ ఇంట తీవ్ర విషాదం

ఏపీ సీఎం వైఎస్‌ జగన్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జ‌గ‌న్‌ మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. కాగా.. గంగిరెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి తండ్రి. ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యులు. ఈయనకు పేదల డాక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5.తవ్వేకొద్ది బయటపడుతున్న ఏసీపీ నర్సింహారెడ్డి అక్రమాలు

అక్రమాస్తుల వ్యవహారంలో ఏసీబీకి చిక్కన మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డికి సంబంధించి మరో వ్యవహారం వెలుగు చూసింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ సైబర్‌ టవర్స్‌ సమీపంలో సుమారు రూ.50 కోట్ల విలువ చేసే 1960 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని నొక్కేసేందుకు కొందరితో కలిసి ప్లాన్‌ వేసినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధం ఉన్న 8 మందిని శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చింది ఏసీబీ. సైబర్‌ టవర్స్‌ ప్రాంతంలో ఉన్న ఈ స్థలాన్ని ప్రభుత్వం గతంలోనే ఏపీఐఐసీ, హుడాకు కేటాయించింది. ఈ భూములను రిజిస్ట్రేషన్‌ చట్టం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6.మారటోరియం : వడ్డీపై వడ్డీ మాఫీ చేస్తాం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా తలెత్తిన సంక్షోభం వల్ల బ్యాంకు రుణాలపై ఆరు నెలల పాటు మారటోరియం విధించిన విషయం తెలిసిందే. అయితే, మారటోరియం విధించిన స‌మ‌యంలోనూ వడ్డీపై వడ్డీ ఉండడంతో దాన్ని మాఫీ చేయాలని వచ్చిన పిటిషన్‌లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ సందర్భంగా తాజాగా కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలని నిర్ణయం తీసుకుని ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది. మార్చి నుండి ఆగస్టు మధ్యకాలంలో వ‌డ్డీలు చెల్లించిన వారికి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7.‘మోసగాళ్లు’ టీజర్.. వాళ్ళ అంతు చూస్తానంటున్న ట్రంప్‌

మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా హాలీవుడ్‌ దర్శకుడు జెప్రీ జీ చిన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. తెలుగు, ఇంగ్లీష్‌ బాషల్లో ఒకే సారి ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రపంచలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కామ్‌ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్న ఈచిత్రంలో నవీన్‌ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8.కీర్తిని చూసి అభిమానులు షాక్‌.. వీడియో వైరల్‌

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో కీర్తి సురేష్‌ ఒకరు. ‘మహానటి’ సావిత్రిగా మెప్పించి జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ చిత్రం తరువాత నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలను ఎన్నుకుంటోంది. ఇటీవల ‘పెంగ్విన్‌’తో ముందుకు వచ్చిన అమ్మడు.. ప్రస్తుతం నితిన్ సరసన ‘రంగ్ దే’, మహేష్ సరసన ‘సర్కారు వారి పాట’ లో నటిస్తోంది. మరోవైపు తమిళంలో రజనీకాంత్, శివ కాంబినేషన్‌లో వస్తున్న మరో సినిమాలో కూడా కీర్తి కీలక పాత్రలో కనించనుంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9.కుర్రాళ్లపై వార్నర్‌ ప్రశంసల జల్లు

దుబాయ్‌ వేదికగా శుక్రవారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. 10 ఓవర్లు కూడా పూర్తి కాకముందే.. ఆ జట్టును ముందుండి నడిపించే ఆటగాళ్లు బెయిర్‌ స్టో(0), వార్నర్(28)‌, విలియమ్సన్‌(9), మనీశ్‌పాండే(29) పెవిలియన్‌ చేరారు. 14 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 81 పరుగులు మాత్రమే. అసలు హైదరాబాద్‌ కనీసం 130 పరుగులు అయినా చేస్తుందా అన్న సందేహాలు అభిమానుల్లో కలిగాయి..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10.విజయవంతంగా శౌర్య క్షిపణి ప్రయోగం

భారత రక్షణ రంగంలో ప్రయోగాలు జోరందుకున్నాయి. మరో అణు సామర్థ్య క్షిపణిని భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. రెండు రోజుల క్రితం ఆధునీకరించిన బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ మిసైల్‌ని విజయవంతంగా ప్రయోగించిన డీఆర్‌డీఓ.. అణ్వస్త్రాలను మోసుకుపోగల సామర్థ్యం ఉన్న శౌర్య మిసెల్స్‌ని శనివారం ఒడిశాలోని బాలాసోర్ తీరంలో విజ‌య‌వంతంగా ప్రయోగించింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story