మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా హాలీవుడ్‌ దర్శకుడు జెప్రీ జీ చిన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. తెలుగు, ఇంగ్లీష్‌ బాషల్లో ఒకే సారి ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రపంచలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కామ్‌ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్న ఈచిత్రంలో నవీన్‌ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు.

తాజాగా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టీజర్‌ను విడుదల చేసి టీం కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అర నిమిషం నిడివి గల మోసగాళ్లు టీజర్‌లో ఆసక్తికరంగా ఉంది. 2016లో జరిగిన 450 మిలియన్ డాలర్ల బిగ్గెస్ట్ స్కామ్ గురించి అగ్ర రాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో అడ్రెస్ చేస్తున్న స్పీచ్ తో మొదలయ్యి.. ఆ భారీ మొత్తాన్ని దోచే జంటగా విష్ణు అండ్ కాజల్ కనిపించి.. ఇది సరిపోతుందిగా అని కాజల్ అంటే.. ఆట ఇప్పుడే మొదలయ్యింది అనడంతో టీజర్‌ ముగుస్తుంది. ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *