కీర్తిని చూసి అభిమానులు షాక్‌.. వీడియో వైరల్‌

By సుభాష్  Published on  3 Oct 2020 8:38 AM GMT
కీర్తిని చూసి అభిమానులు షాక్‌.. వీడియో వైరల్‌

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో కీర్తి సురేష్‌ ఒకరు. 'మహానటి' సావిత్రిగా మెప్పించి జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ చిత్రం తరువాత నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలను ఎన్నుకుంటోంది. ఇటీవల 'పెంగ్విన్‌'తో ముందుకు వచ్చిన అమ్మడు.. ప్రస్తుతం నితిన్ సరసన 'రంగ్ దే', మహేష్ సరసన 'సర్కారు వారి పాట' లో నటిస్తోంది. మరోవైపు తమిళంలో రజనీకాంత్, శివ కాంబినేషన్‌లో వస్తున్న మరో సినిమాలో కూడా కీర్తి కీలక పాత్రలో కనించనుంది.

తాజాగా ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది కీర్తి. అందులో ఆమె టీ, కాపీ, చెన్నై సిటీ పట్ల తన ప్రేమను చెప్పుకొచ్చింది. కాఫీ తనలో కొత్త ఉత్సాహం నింపుతుందని, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కచ్చితంగా కప్పు కాఫీ తాగుతానని అంది కీర్తి. ఈ వీడియోలో ఆమెను చూసిన అభిమానులు షాక్‌ అయ్యారు. అందుకు కారణంగా ఆమె చాలా స్లిమ్‌గా మారిపోవడమే. కీర్తి మొదట్లో బొద్దుగా, బబ్లీగా ఉండేది. ఆ లుక్స్ చూసే ఆమెను కుర్రకారు ఎక్కువగా అభిమానించారు. అలాంటి ముద్దుగుమ్మ డైటింగ్ చేస్తూ గుర్తుపట్టలేనంతగా సన్నబడిపోయింది.

దీంతో నెటీజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇలా మారిపోయావ్‌ ఏంటీ..? మళ్లీ బరువు పెరుగు కీర్తి.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే.. కొందరు మాత్రం ఆమె ఇలాగే చాలా బావుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇప్పటికే 10లక్షలకు పైగా మంది ఈ వీడియోను చూశారు. కీర్తి నటించిన 'మిస్‌ ఇండియా', 'గుడ్‌ లక్‌ సఖి', 'మరక్కర్‌' సినిమాలు పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్నాయి.

Next Story