సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఇప్పటి వరకు ద్విపాత్రాభినయం చేసిందే లేదు. ఆయన డ్యుయెల్‌ రోల్‌లో కనిపిస్తే చూడాలన్న కోరిక అభిమానుల్లో ఉంది. కాగా.. మహేష్ అభిమానులు నిజంగా పండగే. మహేష్‌ డ్యుయల్‌ రోల్‌లో నటించారు. అయితే అది సినిమాలో కాదు.. ఓ యాడ్‌ షూటింగ్‌లో. ప్రఖ్యాత ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తాజా ప్రకటన లో మహేష్ ద్విపాత్రాభినయం అదుర్స్ అనే చెప్పాలి. అన్నయ్యగా తమ్ముడిగానూ కనిపించి మహేష్ అభిమానులకు మంచి ట్రీట్‌ ఇచ్చారు.

పట్నంలో తమ్ముడిని వెతుక్కుంటూ వచ్చిన అన్నయ్య అక్కడకు రాగానే.. డస్ట్ పట్టిన తమ్ముడి ఆఫీస్ టేబుల్ ని చూపించాడు. అంతేనా అక్కడే బాగా మాసిపోయిన గుడ్డల్ని వాషింగ్ మెషీన్లో ఉతుక్కోమని సలహా కూడా పడేశాడు. షాపింగ్ దద్దరిల్లిపోవాలంటూ పంచె కట్టిన కోరమీసం అన్నయ్య సాఫ్ట్ వేర్ తమ్ముడికి చెప్పడం ఆకట్టుకుంది. ఈ యాడ్‌లో ‘ఫ్లిప్‌కార్ట్ ది బిగ్‌ బిలియన్ డేస్‌’ గురించి అన్నయ్య.. తమ్ముడికి వివరిస్తాడు. పంచెకట్టు, కోరమీసంతో అన్నయ్యగా మహేష్ బాబు లుక్ అదుర్స్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.

ప్రస్తుతం మహేష్.. పరశురామ్ దర్శకత్వంలో `సర్కార్ వారి పాట` చిత్రంలో నటిస్తున్నాడు. కరోనా మహమ్మారి కారణంగా ఈ చిత్ర షూటింగ్‌ వాయిదా పడింది. ఇప్పుడిప్పుడే అందరు హీరోలు తమ షూటింగ్స్‌లు మొదలుపెడుతున్నారు. మరీ మహేష్‌ కూడా తొందరలోనే సర్కార్‌ వారి పాట చిత్రీకరణలో పాల్గొననున్నాడు.

Flipkart Big Billion Days 1

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *