న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  29 Sept 2020 4:39 PM IST
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

1.బ్రేకింగ్‌: నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్ని ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. అన్‌లాక్‌లో భాగంగా కొన్నికొన్ని రంగాలకు సడలింపులు ఇచ్చినా.. విద్యాసంస్థలు తెరుచుకునేందుకు మాత్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. అయితే ఏపీలో అక్టోబర్‌ 5 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.జడ్జి సోదరుడిపై దాడి కేసు.. చంద్రబాబు వర్సెస్ ఏపీ డీజీపీ

జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో చోటుచేసుకుంది. వైసీపీ నాయకులే ఈ దాడులకు పాల్పడ్డారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కు లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం, దళితులపై దాడులు, భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాయడం, చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం రామచంద్రపై దాడి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3.నవంబర్‌ రెండో వారంలో GHMC ఎన్నికల నోటిఫికేషన్‌: కేటీఆర్‌

హైదరాబాద్‌ గ్రేటర్‌ ఎన్నికల నగారా మోగనుంది. నవంబర్‌ రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. నవంబర్‌ రెండో వారం తర్వాత ఏ క్షణంలోనైనా గ్రేటర్‌ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం నగర ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లతో కేటీఆర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలు చేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4.బ్రేకింగ్ : న‌వంబ‌ర్ 3న‌ దుబ్బాక ఉప ఎన్నిక

హైద‌రాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి అకాల మ‌ర‌ణంతో దుబ్బాక ఉప ఎన్నిక అనివార్య‌మైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆయా పార్టీలు ప్ర‌చార ప‌ర్వాన్ని మొద‌లు పెట్టాయి. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. దీంతో నేటి నుండి దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రానుంది. దుబ్బాక స‌హా దేశ వ్యాప్తంగా 56 అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5.జోరు మీదున్న ఇస్మార్ట్‌ బ్యూటీ

ఇస్మార్ట్‌ బ్యూటీ నభా నటేష్‌ జోరు మీదుంది. వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ‘నన్నుదోచుకుందువటే’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కన్నడ బ్యూటీ నభా నటేష్‌ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది. లాక్‌డౌన్‌ ఉండకపోతే ఆ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేవి. మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ సోలో బ్రతుకే సోబెటర్‌, సాయి శ్రీనివాస్‌ నటిస్తున్న అల్లుడు అదుర్స్‌ సినిమాల్లో బ్యాక్‌ టూ బ్యాక్‌ షూటింగ్‌లో పాల్గొంటుంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6.Fact Check : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆసుపత్రి బిల్లులు కుటుంబ సభ్యులు కట్టలేదా..?

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం నుండి ఇంకా ఎవరూ తేరుకోలేదు. సుమారు 50 రోజులు హాస్పిటల్‌లోనే బెడ్‌పై ఉండి మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. సెప్టెంబర్ 25వ తేదీన మద్యాహ్నం ఒంటి గంట 4 నిమిషాలకు ఆసుపత్రిలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. మొదట జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలతో బాధపడిన బాలు.. ఆగస్టు 13న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై రేపు తుది తీర్పు

దేశ రాజకీయ, సామాజిక వ్యవస్థను మార్చేసిన 28 ఏళ్లనాటి బాబ్రీ మసీదు కేసులో లక్నో సీబీఐ కోర్టు రేపు (సెప్టెంబర్‌ 30) తీర్పు వెలువరించనుంది. 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై విచారణ జరుపుతున్న సీబీఐ కోర్టు తుది తీర్పు తేదీని ప్రకటించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కె. యాదవ్ బుధవారం తీర్పు ఇవ్వనున్నారు. ఈ కేసులో నిందితులుగా పేర్కొంటూ బీజేపీ అగ్రనేతలు ఎల్‌.కె అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ, పార్టీ సీనియర్‌ నేత ఉమా భారతి తదితరులు కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8.కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందా..? అయితే ఎంత దూరం వ్యాపిస్తుంది..?

కరోనా వైరస్‌పై హైదరాబాద్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపడుతున్నారు. అయితే కరోనాకు ఓ లెక్కంటూ ఉండదు. ఎక్కడ పడితే అక్కడ వాలిపోతుంది. ఎందరినో బలి తీసుకుంటుంది. అయితే ఈ వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తుందా..? ఒక వేళ వ్యాపిస్తే ఎంత దూరం వ్యాపిస్తుంది. గాలి తిరుగుళ్లు తిరుగుతూ వ్యాపిస్తుందా..?.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9.రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు ఇది బ్యాడ్‌ న్యూసే..!

రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే రైల్వే ప్రయాణికులకు మరింత భారం పడనుంది. అత్యాధునిక సదుపాయాలతో రూపుదిద్దుకుంటున్నపలు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల నుంచి టికెట్‌ ధరలపై కనిష్టంగా రూ.10 నుంచి గరిష్టంగా రూ.35 వరకు అదనపు రుసుము వసూలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిని కేంద్ర కేబినెట్‌కు పంపనున్నట్లు సమాచారం. ప్రయాణికులు కొనుగోలు చేసే టికెట్‌ తరగతిని బట్టి ఈ అదనపు ఛార్జీలను వడ్డించనున్నట్లు తెలుస్తోంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10.భార్యపై‌ ఐపీఎస్‌ దాష్టీకం.. విధుల నుండి తప్పించిన‌ సీఎం

మధ్యప్రదేశ్‌లోని ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి గృహహింసకు పాల్పడుతూ అడ్డంగా బుక్కయ్యారు. భార్యపై విచ‌క్ష‌ణా ర‌హితంగా దాడి చేస్తూ ఆ రాష్ట్ర డీజీపీ(ప్రాసిక్యూషన్‌) కెమెరాకు చిక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవ‌డంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివ‌రాళ్లోకెళితే.. పురుషోత్తంశర్మ మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్ర డీజీపీ(ప్రాసిక్యూషన్‌)గా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు‌. అయితే.. పురుషోత్తంశర్మ తన భార్యను కొట్టి, కింద పడేసి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story