బ్రేకింగ్‌: నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్ని ఏపీ ప్రభుత్వం

By సుభాష్  Published on  29 Sep 2020 10:44 AM GMT
బ్రేకింగ్‌: నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్ని ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. అన్‌లాక్‌లో భాగంగా కొన్నికొన్ని రంగాలకు సడలింపులు ఇచ్చినా.. విద్యాసంస్థలు తెరుచుకునేందుకు మాత్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. అయితే ఏపీలో అక్టోబర్‌ 5 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ కేంద్రం నుంచి అనుమతులు రాలేదు. అంతేకాకుండా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఏ మాత్రం తగ్డండం లేదు. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. కరోనా వ్యాప్తిని దృష్టిలో పాఠశాలల ప్రారంభం వాయిదా వేస్తూ నవంబర్‌ 2వ తేదీన తెరవాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది.

మరో వైపు జగనన్నవిద్యా కానుక పథకాన్ని మాత్రం అక్టోబర్‌ 5న ప్రారంభించనుంది ప్రభుత్వం. ఆ రోజు ఏదో ఒక పాఠశాలకు వెళ్లి సీఎం జగన్‌ ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. విద్యా కానుక పథకం కింద విద్యార్థులకు కిట్‌లు అందించనుండగా, అందులో పుస్తకాలు, బ్యాగ్‌, షూస్‌, సాక్స్‌, స్కూల్‌ డ్రెస్‌ మొదలైనవి ఉండనున్నాయి.

Next Story