జోరు మీదున్న ఇస్మార్ట్‌ బ్యూటీ

By సుభాష్  Published on  29 Sep 2020 7:53 AM GMT
జోరు మీదున్న ఇస్మార్ట్‌ బ్యూటీ

ఇస్మార్ట్‌ బ్యూటీ నభా నటేష్‌ జోరు మీదుంది. వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. 'నన్నుదోచుకుందువటే' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కన్నడ బ్యూటీ నభా నటేష్‌ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది. లాక్‌డౌన్‌ ఉండకపోతే ఆ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేవి. మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ సోలో బ్రతుకే సోబెటర్‌, సాయి శ్రీనివాస్‌ నటిస్తున్న అల్లుడు అదుర్స్‌ సినిమాల్లో బ్యాక్‌ టూ బ్యాక్‌ షూటింగ్‌లో పాల్గొంటుంది. మొన్నటి వరకు సోలో బ్రతుకే సోబెటర్‌ సినిమాలో తేజుకు జోడిగా నటించిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా అల్లుడు అదుర్స్‌ మూవీ షూటింగ్‌లో పాల్గొంటుంది.

ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకోవడంతో పాటు నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం ఈమె యువ హీరోలకు సరసన నటించే విధంగా మారిపోయింది. నభా నటేష్‌తో నటించేందుకు పలువురు యంగ్‌ హీరోలు సైతం ఆకస్తి చూపిస్తున్నారట. స్టార్‌ హీరోలు కూడా ఈమెకు ఛాన్స్‌ ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ఈ బ్యూటీ ప్రస్తుతం రెండు సినిమాల తర్వాత రేంజ్‌ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, త్వరలో సోలో బ్రతుకే సో బెటర్‌ సినిమా ఓటీటీ ద్వారా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత అల్లుడు అదుర్స్‌ మూవీ కూడా రాబోతోంది. బెల్లంకొండ మూవీ ఎలా విడుదల కాబోతుందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత ఆమె కొత్త ప్రాజెక్టులపై సంతకం చేసే అవకాశం ఉంది.

Next Story