బాస్ ఓకే అన్నారు.. మ‌రోమారు నా క‌ల‌లు నిజ‌మ‌య్యాయ్‌.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Sep 2020 8:36 AM GMT
బాస్ ఓకే అన్నారు.. మ‌రోమారు నా క‌ల‌లు నిజ‌మ‌య్యాయ్‌.!

నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రంలేదు.‌ పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్ వీరాభిమానిగా, నిర్మాత‌గా ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ పేరుంది. త‌న అభిమాన హీరోను బాస్‌గా సంభోధించే బండ్ల గణేష్‌‌ ముచ్చటగా మూడోసారి పవన్‌కల్యాణ్‌తో సినిమా చేయబోతున్న‌ట్లు ట్విట‌ర్ ద్వారా తెలిపారు.బండ్ల గణేష్ ట్వీట్‌లో.. నా బాస్‌ ఓకే చెప్పారు. మరోసారి నా కలలు నిజమయ్యాయి. నా దేవుడు పవన్‌కల్యాణ్‌కు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు. దీనికి ప‌వ‌న్‌తో దిగిన ఫోటోను ఆ పోస్టుకు జ‌తచేశారు.

ఇదిలావుంటే.. ఇంత‌కుముందు బండ్ల గణేష్‌, పవన్‌కల్యాణ్‌ కాంబినేషన్‌లో సూప‌ర్ హిట్టైన‌ గబ్బర్‌ సింగ్, బాలీవుడ్ హిట్ సినిమా 'ల‌వ్ ఆజ్ క‌ల్' రీమేక్‌‌ అయిన తీన్‌మార్‌ సినిమాలు రూపొందాయి. ఆ త‌ర్వాత‌ వీరి కాంబినేషన్ లో తాజాగా మ‌రో సినిమా తెరకెక్కనుంది. అయితే.. ఈ సినిమాను ఎవ‌రు డైరెక్ట్ చేయ‌నున్నారు.. ప‌వ‌న్‌కు జోడిగా ఎవ‌రు న‌టిస్తారో తెలియాలంటే మాత్రం మ‌రికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఇక బండ్ల గణేష్ నిర్మాత‌గా 2015లో టెంపర్‌ సినిమాను నిర్మించారు. ఆ త‌ర్వాత మ‌రో సినిమాను రూపొందించ‌లేదు. ఐదేళ్ల విరామం‌ తర్వాత బండ్ల గణేష్.. ప‌వ‌న్‌తో సినిమా చేయ‌నున్న‌ట్లు ఈ రోజు ప్ర‌క‌టించారు.

Next Story