బిగ్‌బాస్‌-4: ఊహించని ఎలిమినేషన్‌.. షాక్‌ అయిన ఇంటి సభ్యులు, ప్రేక్షకులు

By సుభాష్  Published on  28 Sep 2020 4:32 AM GMT
బిగ్‌బాస్‌-4: ఊహించని ఎలిమినేషన్‌.. షాక్‌ అయిన ఇంటి సభ్యులు, ప్రేక్షకులు

తెలుగులో బిగ్‌బాస్‌ 4 రియాలిటీ షో కొనసాగుతోంది. నాలుగో సీజన్‌లో కూడా హోస్టుగా నాగార్జున చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్‌ పక్రియ అంతా ఊహించినట్లే జరుగగా, మూడో వారంకు సంబంధించి ఎలిమినేషన్‌ ప్రేక్షకులకు షాక్‌కు గురి చేస్తోంది. ఈ వారంలో ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్‌ ఎదురైంది. ఎలిమినేషన్‌ అయిన వ్యక్తి పేరు ప్రకటించడంతో హౌస్‌లోని కంటెస్టెంట్లతో పాటు చూస్తున్న ప్రేక్షకులు కూడా షాక్‌ అయ్యారు.

ఇక మూడో వారంలో ఎలిమినేషన్స్‌లో ఉన్న ఏడురు ఇంటి సభ్యులు లాస్య, దేవి నాగవళ్లి, మోనాల్‌, కుమార్‌ సాయి, మెహబూబ్‌, అరియానా, హారిక సేవ్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఇక చివరికి ఎలిమినేషన్‌లో కుమార్ సాయి, దేవి నాగవల్లి ఉన్నారు. వీరిలో ఎవరు సేవ్‌ అవుతారు. ఎవరు వెళ్లిపోతారు తెలుసుకునేందుకు బిగ్‌బాస్‌ రెండు బాక్స్‌లను ఏర్పాటు చేశారు. అందులో చేయిపెట్టిన తర్వాత ఎవరికి రెడ్‌ కలర్‌ అంటితే వారు ఎలిమినేషన్‌, ఎవరికి గ్రీన్‌ కలర్‌ అంటితే వారు సేవ్‌ అయినట్లు చెప్పారు నాగార్జున. ఇక ఇద్దరు బాక్స్‌లో చేయి పెట్టగానే కుమాస్‌ సాయి సేవ్‌ కాగా, దేవి నాగవల్లి ఎలిమినేట్‌ అయ్యింది.

దేవి ఎలినేట్‌ కాగా, హౌస్‌ మొత్తం షాక్‌కు గురైంది. అరియానా అయితే వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఇక స్టేజ్‌పైకి వచ్చిన దేవిని ఎలిమినేట్‌ కావడానికి కారణం ఏమై ఉంటుందని నాగార్జున అడుగగా, నాకు తెలియదు సార్‌.. అని దుఃఖాన్ని దిగమింగుకుంది. ఆమె ఎలిమినేట్‌ కావడం నాగార్జున కూడా ఆశ్చర్యపోయాడు. ఇంటి సభ్యులకు పలు సూచనలు చేసిన దేవి ఇలా ఎలిమినేట్‌ కావడం ఇంటి సభ్యులు, ప్రేక్షకులు సైతం ఆశ్యర్యపోయారు. హౌస్‌లో సైలెంట్‌గా ఉంటూ తనపని , తన గేమ్‌ తాను ఆడుకుంటు పోయిన దేవి ఎలా ఎలిమినేట్‌ అయ్యిందని ఆలోచనలో పడ్డారు. మొత్తానికి ఈ వారం ఎలిమినేట్‌ అయిన తీరు అందరికి షాక్‌కు గురి చేసింది.

Next Story