హైదరాబాద్‌కు రియల్‌ హీరో సోనుసూద్‌.. భారీగా ఎగబడ్డ అభిమానులు

By సుభాష్  Published on  28 Sep 2020 8:03 AM GMT
హైదరాబాద్‌కు రియల్‌ హీరో సోనుసూద్‌.. భారీగా ఎగబడ్డ అభిమానులు

టాలీవుడ్‌ రియల్‌ హీరో సోనుసూద్‌ హైదరాబాద్‌లో అడుగు పెట్టాడు. ఎయిర్‌పోర్టులో దిగిన ఆయన మాస్క్‌ ధరించినప్పటికీ గుర్తించిన అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. సెల్ఫీలకు ఎగబడ్డారు. అభిమానులు నిరాశ చెందకుండా సోనుసూద్‌ ఫోటోలు దిగారు. దీంతో అభిమానుల సంతోషానికి హద్దులు లేకుండా పోయింది. కాగా, కరోనా విజృంభిస్తున్న తరుణంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేక చాలా మంది ఉపాధి కోల్పోయారు. అంతేకాదు ఎంతో మంది విదేశాల్లో చిక్కుకుని స్వదేశానికి రావడానికి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాంటి విపత్కర సమయంలో సోనుసూద్‌ దేవుడిలా మారాడు.

ఇతర దేశాల్లో ఉన్న ఎంతోమందికి సొంత ఖర్చులతో స్వదేశానికి రప్పించాడు. అలాగే ఉపాధి కోల్పోయిన ఎంతోమందికి అండగా నిలిచి తనవంతు సాయం చేసి రియల్‌ హీరో అనిపించుకున్నాడు. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా సోనుసూద్‌ అంటే ఒక దేవుడిలా మారిపోయాడు. ఎందరి నుంచో ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా, ప్రస్తుతం సోనుసూద్‌ తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో చిరంజీవి హీరోగా, కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య ఒకటి కాగా, బెల్లంకొండ శ్రీనివాస్‌ నటిస్తున్న అల్లుడు అదుర్స్‌లో నటించనున్నారు.

Next Story