న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 23 Aug 2020 4:04 PM ISTకరోనా టిప్స్ పాటించండి
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోతోంది. కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
‘బాబ్రీ’ తీర్పు గడువు సెప్టెంబర్ 30కు పొడిగింపు
బాబ్రీ మసీదు కేసుకు సంబంధించిన తీర్పు గడువును సెప్టెంబరు30 దాకా పొడిగించాలని సుప్రీం కోర్టు సీబీఐ కోర్టుకు సూచించింది. ఈ కేసులో సీనియర్ బీజేపీ నాయకులు ఎల్.కె. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, కల్యాణ్ సింగ్‌లు క్రిమినల్ చార్జీలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. జస్టిస్ రోహింటన్ నారిమన్, నవీన్ సిన్హా, ఇందిరా బెనర్జీలతో కూడిన బెంచ్ సీబీఐ కోర్టు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
కరోనాపై మోదీ సర్కార్ వార్.. 73 రోజుల్లో కొత్త ప్లాన్ రెఢీ
కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచం.. దానికి చెక్ పెట్టేందుకు అవసరమైన వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా? అని కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తోంది. చూస్తుండగానే ఆగస్టు పూర్తి కానున్న ఈ తరుణంలో.. వ్యాక్సిన్ రాకపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలింది
హర్యానాలోని గురుగ్రామ్‌లో శనివారం అర్దరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సోహ్నా రోడ్డులో ఆరు కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఫ్లైఓవర్ ప్రమాదశాత్తు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మాత్రమే గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
రామ్ చరణ్ డ్రీమ్ ప్రాజెక్టు ఏంటో తెలుసా.?
ప్రతి నటుడికీ ఫలానా పాత్ర చేయలని లేదా ఫలానా జానర్లో నటించాలని లేదా ఓ నిజ జీవిత కథలో నటించాలని.. ఇలా కొన్ని కలలుంటాయి. రామ్ చరణ్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. అతడికి ఒక జానర్లో నటించాలన్న కోరిక కెరీర్ ఆరంభం నుంచి ఉందట.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
సినిమా షూటింగ్‌లకు కేంద్రం అనుమతి.. మార్గదర్శకాలు విడుదల
ఆన్‌లాక్ 3.0లో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శకాల్లో భాగంగా సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగ్‌లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్‌లు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేక్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
పరవళ్లు తొక్కుతున్న ప్రకాశం బ్యారేజీ.. 70 గేట్ల ఎత్తివేత
ప్రకాశం బ్యారేజీ నీటితో పరువళ్లు తొక్కుతోంది. బ్యారేజీలోకి భారీగా వరద నీరు రావడంతో అధికారులు 70 గేట్లను ఎత్తి నీటిని దిగువన వదులుతున్నారు. బ్యారేజీలోకి ఇన్‌ప్లో 3,13,834 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 3,01,057 క్యూసెక్కులు ఉంది. 12 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టంతో బ్యారేజ్ నిండుకుండలా కళకళలాడుతోంది. ఈస్టర్న్, వెస్టన్ కెనాల్స్ ద్వారా.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
అవకాశం వస్తే ఆ ఇద్దరు హీరోలతో నటిస్తా: రోజా
ప్రముఖ సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఓ వైపు
ఎమ్మెల్యేగా, మరో వైపు ఏపీఐఐసీ చైర్ పర్సన్, అలాగే బుల్లితెరపై పలు షోలు నిర్వహిస్తున్నారు.
అయితే సినిమాలకు దూరమై చాలా ఏళ్లు గడిచిపోతోంది. చివరిసారిగా రోజా 2015లో వచ్చిన
‘ఎన్ వాళి తాని వాళి’ అనే తమిళ సినిమాలో కనిపించారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఉగ్రవాదుల జాబితాను విడుదల చేసిన పాక్.. జాబితాలో దావూద్ పేరు
ఎట్టకేలకు పాకిస్థాన్ ఉగ్రవాదుల జాబితాను విడుదల చేసింది. దీంతో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నాడని పాకిస్థాన్ స్పష్టం చేసింది. దావూద్ కరాచీలోనే ఉన్నట్లు ఇమ్రాన్‌ఖాన్ సర్కార్ శనివారం ప్రకటించింది. తాజాగా ఆ దేశ ఉగ్రవాదులను గుర్తిస్తూ విడుదల .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
సీఎం కేసీఆర్ సంతకం ఫోర్జరీ
సీఎం కేసీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు ఓ ఘనుడు. వివరాళ్లోకెళితే.. కరీంనగర్ జిల్లాకు చెందిన చింటు అనే యువకుడు టీఆర్ఎస్‌లో కార్యకర్త. వాట్సప్ స్టేటస్ డీపీ, ఫేస్ బుక్ లో కేసీఆర్, కేటీఆర్ లతో దిగిన ఫొటోలు, తెలంగాణ స్టేట్- ఆల్ ఇండియా యాంటీ కరప్షన్ కమిటీ ఛైర్మన్, కరీంనగర్ జిల్లా టిఆర్ఎస్ యువజన కార్యదర్శి అంటూ పరిచయాలు పెంచు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి