న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 21 Aug 2020 1:36 PM GMTఇక బయటకు వస్తే మాస్క్‌లు అవసరం లేదు.. అక్కడి ఆరోగ్యశాఖ కీలక ప్రకటన
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడికి ప్రపంచ దేశాలు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా.. ఇంకా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక తొలి కేసు నమోదైనా చైనాలో పరిస్థితులు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఏపీలో కొత్తగా 91 కరోనా మరణాలు
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ఏపీ సర్కార్ ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక ఏపీ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు చేస్తున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 55,010 కరోనా పరీక్షలు చేయగా,.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
శ్రీశైలం అగ్ని ప్రమాదంలో 9కి చేరిన మృతుల సంఖ్య
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఇప్పటి వరకు మూడు మృతదేహాలను బయటకు తీశారు. మృతులు అసిస్టెంట్ ఇంజనీరింగ్‌లు మోహన్‌రావు, ఉజ్మ ఫాతిమా, సుందర్‌గా గుర్తించారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఇంకా సహాయక చర్యలు చేపడుతున్నాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలకు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
శ్రీశైలం ప్రమాదంపై సీఐడీ విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశం
శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు ఫలించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
18 కోట్ల పాన్ కార్డులపై వేటు పడనుందా..?
దేశ వ్యాప్తంగా 18 కోట్ల పాన్‌కార్డులపై వేడు పడనున్నట్లు తెలుస్తోంది. పాన్ కార్డులను ఆధార్ కార్డుతో లింక్ చేయని పాన్‌కార్డులను గుర్తించి నిర్వీర్యం చేస్తామని ఐటీశాఖ స్పష్టం చేసింది. గడువు ముగిసేలోగా పాన్‌కార్డును ఆధార్ నంబర్‌తో లింక్ చేయాలని ఆ శాఖ స్పష్టం చేసింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
కరోనా.. ప్రతి దశా సవాలేనా..!
కరోనా చికిత్సలో అన్నిటి కంటే ప్రధానం మనోబలం. దీన్ని మించిన మందు లేదు. మనం ధైర్యంగా ఉంటే మందులు కూడా పనిచేస్తాయి అంటున్నారు. వైద్యులు. గత అయిదు నెలలుగా కరోనా వ్యాధి వస్తున్న తీరుతెన్నును పరిశీలిస్తే.. ప్రతి దశా అటు బాధితులకు ఇటు వైద్యులకు ఓ సవాల్‌గానే నిలిచిందని చెప్పవచ్చు. మొదట్లో కరోనాకు చికిత్సకోసం .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇంటివాడు కాబోతున్న టీమిండియా ఆల్‌రౌండర్
టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇందుకు సంబంధించి నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా అంకౌంట్ ద్వారా వెల్లడించాడు. ఈ మేరకు తన కాబోయే .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
బీహార్‌కు వచ్చినప్పుడు గ్లాసు గేదె పాలు తాగుతా: సోనూసూద్
ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందుల్లో పడుతున్న నిరుపేదలకు అండగా నిలుస్తూ తనవంతు సహాయం చేస్తున్న ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూసూద్. ఇప్పుడు సోనూసూద్‌పై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మందికి తనకు తోచిన విధంగా సాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
బాలీవుడ్‌లో విషాదం: ప్రముఖ ఆర్టిస్ట్ ఆత్మహత్య
ఈ ఏడాది బాలీవుడ్‌లో వరుస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొంత మంది ప్రముఖులు అనారోగ్యంతో మరణించగా, మరి కొందరు ఆత్మహత్యలు చేసుకుని మృతి చెందుతున్నారు. తాజాగా ప్రముఖ ఆర్టిస్ట్ రామ్ ఇంద్రనీల్ కామత్ (40) ఆత్మహత్యకు పాల్పడినట్లు .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
సురేష్ రైనా.. నువ్వు రిటైర్మెంట్ ఇవ్వడం సరికాదేమోనని అభిప్రాయపడ్డ మోదీ..!
అంతర్జాతీయ క్రికెట్ నుండి మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ను ప్రకటించగానే.. సురేష్ రైనా కూడా తాను ధోని బాటలో ప్రయాణిస్తున్నానని తెలిపాడు. సురేష్ రైనా వయసు 33 సంవత్సరాలే.. రైనా ఎందుకో తొందరపడ్డాడు అని చాలా మంది అభిప్రాయపడ్డారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి