ఇంటివాడు కాబోతున్న టీమిండియా ఆల్‌రౌండ‌ర్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Aug 2020 8:01 AM GMT
ఇంటివాడు కాబోతున్న టీమిండియా ఆల్‌రౌండ‌ర్‌

టీమిండియా ఆల్‌ రౌండర్‌ విజయ్‌ శంకర్ త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇందుకు సంబంధించి నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన త‌న సోష‌ల్ మీడియా అంకౌంట్‌ ద్వారా వెల్లడించాడు. ఈ మేర‌కు తన కాబోయే బార్య వైశాలి వీశ్వేశ్వరన్‌తో కలిసి దిగిన రెండు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ ఉంగరం ఎమోజీని జత చేశారు.

View this post on Instagram

💍 PC - @ne_pictures_wedding

A post shared by Vijay Shankar (@vijay_41) on

ఈ సందర్బంగా విజయ్‌కు అతని సహచరులు, అభిమానులు విష్ చేస్తున్నారు. విజయ్‌ పోస్టుపై స్పందించిన కేఎల్‌ రాహుల్‌, చాహల్‌ ‘అభినందలు సోదరా’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఇటీవల మరో క్రికెటర్, టీమిండియా స్పిన్న‌ర్‌‌ యుజువేంద్ర చాహల్‌ సైతం ధనశ్రీ వర్మతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు.

ఇదిలావుంటే.. విజయ్‌ శంకర్‌ 2018లో కొలంబోలో జరిగిన శ్రీలంక- భారత్‌ టీ 20 మ్యాచ్‌తో టీమిండియా ఆరంగ్రేటం చేశాడు. అనంత‌రం మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా వన్డేల్లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. శంకర్‌ భారత్‌ తరఫున ఇప్పటి వరకు 12 వన్డేలు, తొమ్మిది టీ 20లు ఆడాడు. విజయ్‌ శంకర్ త్వరలో యూఏఈలో జరిగే ఐపీఎల్-13‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడనున్నాడు.

Next Story