బాలీవుడ్‌లో విషాదం: ప్రముఖ ఆర్టిస్ట్‌ ఆత్మహత్య

By సుభాష్  Published on  21 Aug 2020 6:49 AM GMT
బాలీవుడ్‌లో విషాదం: ప్రముఖ ఆర్టిస్ట్‌ ఆత్మహత్య

ఈ ఏడాది బాలీవుడ్‌లో వరుస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొంత మంది ప్రముఖులు అనారోగ్యంతో మరణించగా, మరి కొందరు ఆత్మహత్యలు చేసుకుని మృతి చెందుతున్నారు. తాజాగా ప్రముఖ ఆర్టిస్ట్‌ రామ్‌ ఇంద్రనీల్‌ కామత్‌ (40) ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ముంబాయి మాతుంగ ప్రాంతంలో తన తల్లి, సోదరితో నివసిస్తున్న ఇంద్రనీల్‌.. బాత్‌ టబ్‌లో విగజీవిగా కనిపించారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటన స్థలంలో ఓ సూసైడ్‌ నోట్‌ని స్వాధీనం చేసుకున్నారు. అయితే తన చావుకు ఎవరు కారణం కాదంటూ ఇంద్రనీల్‌ కామత్‌ తన సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

కాగా, ముంబాయిలోని గ్లాస్‌ వర్క్‌ పెయింటర్స్‌లో కామత్‌కి మంచి పేరు ఉంది. దీంతో పాటు మంచి ఫోటోగ్రాఫర్‌. కామత్‌కు బాలీవుడ్‌లో పలువురితోనూ మంచి పరిచయాలు కూడా ఉన్నాయి. గత కొంత కాలంగా తీవ్ర ఒత్తిడితో బాధపడుతున్నట్లు సమాచారం. లాక్‌డౌన్‌ సమయంలో మరింత మనస్థాపానికకి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఆయన మరణంపై పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు. ఒక మంచి ఆర్టీస్ట్, మంచి మిత్రున్ని కోల్పోయానంటూ నటి సుస్మితా సేవ్‌ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. రామ్‌ ఇంద్రనీల్‌ తీవ్ర ఒత్తిడి వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడా.. లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే దానిపై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

Next Story