సోనూసూద్‌కు సాయం కోసం ఒక్కరోజే 31 వేల మెసేజ్‌లు

By సుభాష్  Published on  20 Aug 2020 2:09 PM GMT
సోనూసూద్‌కు సాయం కోసం ఒక్కరోజే 31 వేల మెసేజ్‌లు

కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకుని రియల్‌ హీరో అయ్యాడు సోనూసూద్‌, కుల, మత, భాష అనే తేడా లేకుండా కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తూ తనవంతు సాయం చేస్తూ మంచి మనసును చాటుకుంటున్నాడు. ఉపాధి కూలీల నుంచి ఉద్యోగం కోల్పోయిన వారు, కరోనాతో బాధపడుతున్న పేదలకు చికిత్స అందించడం, వలస కూలీలను స్వస్థలాలకు చేరవేయడం, ఇతర దేశాల్లో చిక్కుకున్న విద్యార్థులను సైతం భారత్‌కు రప్పించడం ఇలా ఒక్కటేమిటి ఎంతో మందికి సాయం చేస్తున్న సోనూసూద్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఇదిలా ఉండగా, సాయం కోసం ప్రజలు ఇప్పటికీ సోనూసూద్‌కు వేలాది మేసేజ్‌లు చేస్తున్నారట. గురువారం ఒక్క రోజే ఆయనకు ఏకంగా 31వేల మేసేజ్‌లు అందాయి. ఈ విషయాన్ని సోనూసూత్‌ స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. మెయిల్స్‌కు 1137, ఫేస్‌బుక్‌ మేసేజ్‌లు 19వేలు, ఇన్‌స్టాగ్రామ్‌కు 4812 మేసేజ్‌లు, ట్విట్టర్‌కు 6741 మెసేజ్‌లు వచ్చినట్లు తెలిపాడు. అయితే ఈ రోజు వచ్చిన మెసేజ్‌లు.. 'ప్రతి ఒక్కరిని చేరుకోవడం అసాధ్యం, అయినా కూడా నా వంతుగా ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఒక వేళ ఎవరిదైన నేను మిస్‌ అయితే మాత్రం నన్ను క్షమించండి' అని సోనూసూద్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సోనూసూద్‌ ఇప్పటికే ఎంతో మందిని ఆదుకున్నారు. ఇలా పేదలకు అండగా నిలువడంతో నిజమైన హీరో అనిపించుకుంటున్నారు.Next Story