సురేష్ రైనా.. నువ్వు రిటైర్మెంట్ ఇవ్వడం సరికాదేమోనని అభిప్రాయపడ్డ మోదీ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Aug 2020 6:30 AM GMT
సురేష్ రైనా.. నువ్వు రిటైర్మెంట్ ఇవ్వడం సరికాదేమోనని అభిప్రాయపడ్డ మోదీ..!

అంతర్జాతీయ క్రికెట్ నుండి మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ను ప్రకటించగానే.. సురేష్ రైనా కూడా తాను ధోని బాటలో ప్రయాణిస్తున్నానని తెలిపాడు. సురేష్ రైనా వయసు 33 సంవత్సరాలే.. రైనా ఎందుకో తొందరపడ్డాడు అని చాలా మంది అభిప్రాయపడ్డారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహేంద్ర సింగ్ ధోనికి లెటర్ రాసినట్లుగానే మోదీ సురేష్ రైనాకు కూడా లెటర్ రాశారు. భారత క్రికెట్ కు రైనా చేసిన సేవలను కొనియాడారు. అలాగే తొందరగా రిటైర్మెంట్ తీసుకున్నావనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు.

నీ విషయంలో రిటైర్మెంట్ అన్న పదాన్ని వాడాలని అనుకోవడం లేదని.. చాలా తక్కువ వయసు, ఎంతో ఎనర్జీ కలిగిన నీ విషయంలో రిటైర్మెంట్ కరెక్ట్ కాదని అన్నారు నరేంద్ర మోదీ. 33 సంవత్సరాల రైనా, ధోనితో కలిసి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు.

నిన్నొక మంచి ఆటగాడిగానే కాదు.. కెప్టెన్ కు అవసరమైనప్పుడు వికెట్లు తీయగలిగే మంచి బౌలర్ గా కూడా గుర్తు ఉంటావు.. నీ ఫీల్డింగ్ తో ఎన్నో పరుగులను ఆపి జట్టుకు ఉపయోగంగా ఉన్నావని మోదీ తన లెటర్ లో తెలిపారు. 2011 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో 34 పరుగులతో నాటౌట్ గా నిలవడాన్ని కూడా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ఇంకా మరెన్నో విషయాలను భారత ప్రధాని సురేష్ రైనా గురించి వెల్లడించారు.

నరేంద్ర మోదీ లెటర్ కు సురేష్ రైనా ధన్యవాదాలు తెలిపాడు. దేశం కోసం స్వేదాన్ని రక్తాన్ని తాము ధారపోస్తాం. ప్రజలు, దేశ ప్రధాని నుండి వచ్చే ప్రశంసల కంటే తమకు మరేదీ ముఖ్యం కాదన్నాడు రైనా.

మహేంద్ర సింగ్ ధోనీకి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘ సందేశం పంపారు. దీనిపై ధోనీ కృతజ్ఞతలు తెలిపాడు. "ఎవరైనా కళాకారుడు కానీ, సైనికుడు కానీ, క్రీడాకారుడు కానీ కోరుకునేది అభినందనలే. తమ కఠోర శ్రమను, త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తించి మెచ్చుకోవాలని భావిస్తారు" అంటూ ట్వీట్ చేశాడు.

రైనా ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. సెప్టెంబర్ 19న ధోని తో కలిసి రైనా కూడా గ్రౌండ్ లోకి అడుగుపెట్టనున్నాడు. అభిమానులు వీరిద్దరినీ చూడడానికి ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు.

Next Story