న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  27 Jun 2020 4:20 PM IST
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు.. వారికి కరోనా పాజిటివ్‌.. తల్లిదండ్రులకు నెగిటివ్‌

కరోనా వైరస్‌..ఈ పేరు వింటేనే గుండెల్లో దడ పుట్టేస్తుంటుంది. శత్రువు ఎదురొచ్చినా బయపడకున్న కరోనా అంటేనే వణికిపోవాల్సిందే. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి చాపకింద నీరులా దాదాపు 200లకుపైగా దేశాలకు చాపకింద నీరులా విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పాజిటివ్‌ కేసులు, మరణాలతో దేశాలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మోదీ చేతులెత్తేశారా? చేసేదేమీ లేదా?

గడిచిన కొంతకాలంగా ప్రధానమంత్రి మోదీ మౌనంగా ఉంటున్నారు. అలా అనిఆయన పని చేయటం లేదని ఆరోపించటం లేదు. తక్కువ పని చేస్తున్నారని విమర్శలు చేయట్లేదు. మాయదారి రోగంపై సమరం చేయటంలో ప్రధాని మోదీకి మించినోళ్లు ఎవరూ లేరనే వేళ.. ఆయన ఏం చెబితే.. యావత్ జాతి అదే చేసింది. ఇంట్లో నుంచి రావొద్దంటే రాలేదు. దీపాలు పెట్టమంటే పెట్టారు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

జులై 31 వరకు పాఠశాలలు మూత: డిప్యూటీ సీఎం

కరోనా మహమ్మారి వల్ల విద్యార్థులకు శాపంగా మారింది. ఈ వైరస్‌ వల్ల సామాన్యుల నుంచి విద్యార్థులు, వ్యాపారస్థులు, ప్రతి ఒక్కరిపై ప్రభావం తీవ్ర స్థాయిలో పడింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయం గడిచిపోతున్నా..కరోనా వల్ల పాఠశాలలు తెరుచుకునే అవకాశం లేకుపోవడంతో విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఈ సంవత్సరం చదువులు .. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇంకా పొంచి ఉన్న మిడతల దండు ముప్పు‌ : శబ్దాలు చేయండి.. తలుపులు, కిటికీలు మూసేయండి

గురుగ్రామ్ కు మిడతల ప్రమాదం ఇంకా పొంచే వుంది. పంటలను నాశనం చేసే మిడతలు ఏ సమయంలోనైనా దాడి చేయొచ్చని అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ప్రభుత్వ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. హర్యానా జిల్లాలో మిడతల దండు కనిపించాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వీలైనంత గా శబ్దాలు చేసి వాటిని తరిమికొట్టాలని కోరారు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మీడియాపై మండిపడ్డ రకుల్‌ ప్రీత్‌

రకుల్‌ ప్రీత్‌ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. తనపై వచ్చే రుమర్స్‌, వార్తలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటుంది. తప్పుడు వార్తలు రాస్తే వెంటనే సెటైర్‌ వేస్తుంటుంది. లాక్‌డౌన్‌ కారణంగా రకూల్‌ ఇంటికే పరిమితమైంది. అయితే తపై జరుగుతున్న దుష్ప్రచారానికి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కు తెగ కోపం వచ్చింది. తనపై లేనిపోనివి రాస్తున్నారంటూ మీడియాపై చిర్రుబుర్రులాడింది... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కారులో ప్ర‌యాణిస్తున్న మంత్రి.. స‌డ‌న్‌గా ఫోన్.. డ్రైవ‌ర్‌కు క‌రోనా పాజిటివ్ అని.. అంతే..

మంత్రి కారులో ప్రయాణిస్తున్నాడు.. స‌డ‌న్‌గా మంత్రి పీఏ ఫోన్ రింగ‌య్యింది. ఫోన్ ఎత్తిన పీఏకు అవ‌త‌లివైపు నుండి షాకింగ్ న్యూస్‌.. కారు డ్రైవరుకు కరోనా ఉందని స‌మాచారం. దీంతో మంత్రి మార్గమధ్యంలోనే కారు దిగి వేరే కారులోకి మారారు. ఈ ఘ‌ట‌న‌ తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై పట్టణంలో జ‌రిగింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కేసీఆర్‌ను అభినందిస్తూ లేఖ రాసిన నేవీ వైస్‌ అడ్మిరల్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నేవీ వైస్‌ అడ్మిరల్‌ ఎంఎస్‌ పవార్‌ లేఖ రాశారు. కల్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబానికి చేసిన సాయనికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు వైస్‌ అడ్మిరల్‌ రెండు పేజీ లేఖ రాశారు. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన ఓ అమరవీరుడి కుటుంబం పట్ల ముఖ్యమంత్రి చూపిన అభిమానానికి ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నంద్యాలలో లిక్విడ్ కార్బన్ డయాక్సడ్ లీక్‌.. ఒకరి మృతి

విశాఖ ఎల్‌జీ గ్యాస్‌ లీక్‌ ఘటన మరువక ముందే ఏపీలో మరో గ్యాస్‌ లీక్‌ ఘటన కలకలం రేపింది. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణ శివారులో ఉన్న ఎస్పీవై ఆగ్రోస్‌ కంపెనీలో లిక్విడ్ కార్బన్ డయాక్సడ్ లీక్‌ అయింది. ఈ ఘటనలో జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ రెడ్డి మృతి చెందగా.. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకున్నారు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

దాసరి ఇంట్లో భగ్గుమంటున్న ఆస్తి వివాదాలు

దివంగత దిగ్గజం దాసరి నారాయణరావు ఇంట్లో ఆస్తి వివాదాలు భగ్గుమంటున్నాయి. దాసరి కుమారులైన ప్రభు, అరుణ్‌ల మధ్య ఆస్తుల గొడవ పెరిగిపోతోంది. అయితే ఇటీవల దాసరి అరుణ్‌ రాత్రి సమయంలో తన ఇంటిగోడ దూకి వచ్చి , మద్యం మత్తులో దాడికి పాల్పడ్డాడని దాసరి ప్రభు జూబ్లీ హిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దాసరి కుటుంబం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నీకిష్టమైన వదిన ఎవరు?.. బాబ‌ర్ స‌మాధానానికి సానియా సీరియ‌స్‌

పాక్ ‌స్టార్ బ్యాట్స్‌మెన్, ‌‌కెప్టెన్‌ బాబర్ ఆజ‌మ్‌పై భారత టెన్నిస్ స్టార్‌‌ సానియా మీర్జా ఫైర్ అయ్యింది. బాబర్‌ ఇచ్చిన ఓ సమాధానం సానియాకు కోపం తెప్పించింది. దీంతో ‘బాబర్‌.. నిన్ను చంపేస్తా’ అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అయితే.. ఇదంతా సీరియ‌స్ అనుకోకండి.. సానియా మీర్జా భర్త, పాక్ సీనియ‌ర్ ఆల్‌రౌండ‌ర్‌ షోయబ్‌ మాలిక్‌.. బాబర్‌ మధ్య జరిగిన ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్‌ సందర్భంగా జ‌రిగిన ఓ సరదా సంభాష‌ణ మాత్ర‌మే‌... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story