మీడియాపై మండిపడ్డ రకుల్‌ ప్రీత్‌

By సుభాష్  Published on  27 Jun 2020 8:52 AM GMT
మీడియాపై మండిపడ్డ రకుల్‌ ప్రీత్‌

రకుల్‌ ప్రీత్‌ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. తనపై వచ్చే రుమర్స్‌, వార్తలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటుంది. తప్పుడు వార్తలు రాస్తే వెంటనే సెటైర్‌ వేస్తుంటుంది.

లాక్‌డౌన్‌ కారణంగా రకూల్‌ ఇంటికే పరిమితమైంది. అయితే తపై జరుగుతున్న దుష్ప్రచారానికి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కు తెగ కోపం వచ్చింది. తనపై లేనిపోనివి రాస్తున్నారంటూ మీడియాపై చిర్రుబుర్రులాడింది. ఇదిలా ఉండగా.. తమిళంలో శివకార్తికేయన్‌కి జంటగా రకూత్‌ నటిస్తోంది. అయితే సినిమా నుంచి ఆమెను తొలగించారని మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో రకుల్‌ ట్విట్టర్‌ వేదికగా ఘాటుగా స్పందించింది. ఇలా మీడియాలో కథనాలు రావడంపై సరైంది కాదని మండిపడింది. ఎప్పుడు మీడియా బాధ్యతతో నడుచుకుంటుంది.. ఎప్పుడు నిజ నిర్ధారణ చేసుకుంటుంది..అంటూ రకుల్‌ సెటైర్లు వేశారు.

అయితే రకుల్‌ నటిస్తున్న ఆ సినిమా కొంత భాగం షూటింగ్‌ జరుకొన్న తర్వాత లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయింది. ఇక తాజాగా సినిమా షూటింగ్‌ మొదలవుతున్న తరుణంలో తాను మరో రెండు నెలల వరకూ షూటింగ్‌కు రానని రకుల్‌ దర్శక, నిర్మాతలకు తెలిపిందని, దీంతో ఆగ్రహించిన నిర్మాత ఆమెను సినిమా నుంచి తొలగించారని తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇలా వచ్చిన వార్తలు రకుల్‌ దృష్టికి వెళ్లాయి. బాధ్యతాయుతమైన జర్నలిజం మనకు ఎప్పుడు వస్తుందా..? వాస్తవాలను చెక్‌ చేసుకుని రాయడం అన్నది మీడియా ఎప్పుడు ప్రారంభిస్తుంది.. అంటూ రకుత్‌ ప్రీత్ మీడియాలపై ఫైర్‌ అయ్యింది. నాకూ షూటింగ్‌ చేయాలనే ఉంది. అసలు షూటింగ్‌లు ఎక్కడ జరుగుతున్నాయో చెప్పండి అంటూ మీడియాను ప్రశ్నించింది.

ఈ విషయమై ఈ సినిమా దర్శకుడు ఆర్‌. రవికుమార్‌ స్పందించారు. నేను ఇంత వరకు పని చేసిన ప్రొఫెషనల్‌ ఆర్టిస్టులలో రకుల్‌ ఒకరు. ఆమెతో షూటింగ్‌ మొదలు పెట్టడానికి మేము కూడా ఎంతో ఎదురు చూస్తున్నాం. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తాము.. అంటూ చెప్పుకొచ్చాడు.Next Story